స్నేహితుడు కోసం త్రిష ఆ ఛాన్స్ తీసుకుందా?
స్టార్ హీరోయిన్లు అంతా ఇప్పుడు ఐటం నంబర్ల ఆఫర్లు వస్తే ఏమాత్రం మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 26 Aug 2024 5:20 AM GMTస్టార్ హీరోయిన్లు అంతా ఇప్పుడు ఐటం నంబర్ల ఆఫర్లు వస్తే ఏమాత్రం మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు. సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే, శ్రుతిహాసన్ ఇలా ఏ ఒక్కరు ఐటం పాట అంటే తగ్గేదేలే! అంటూ చెలరేగుతున్నారు. హీరోయిన్ గా కొనసాగుతూనే ఆ రకమైన అవకాశాలు సై తం సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక అవకాశాలు లేని భామలకైతే ఇలాంటి అవకాశం వస్తే? అదే మహా ప్రసాదంగా భావిస్తున్నారు.
కానీ అందాల త్రిష మాత్రం ఇంతవరకూ ఆ ఛాన్స్ తీసుకోలేదు. అమ్మడు ఎంతో మంది సీనియర్ హీరోలతో పనిచేసింది. సెకెండ్ ఇన్సింగ్స్ ని సైతం అదే దూకుడుతో ముందుకు తీసుకెళ్తోంది. `పొన్నియన్ సెల్వన్` తర్వాత అమ్మడి కెరీర్ మరింత స్పీడప్ అయింది. ఇప్పుడున్న దశలో త్రిష కి ఐటం పాటలు చేసే అవసరం లేదు. మరి అలాంటి త్రిష ఇప్పుడు స్నేహితుడు తలపతి విజయ్ కోసం ఛాన్స్ తీసుకుంటుందా? అంటే అవుననే గుస గుస వినిపిస్తుంది.
ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిదే. మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో త్రిష ఇదే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడినట్లు కోలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. నేరుగా థియేటర్లో త్రిష సడెన్ ఎంట్రీతో సర్ ప్రైజ్ చేయాలనే మేకర్స్ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు వినిపిస్తోంది. మరి ఇది నిజమైతే సంచలనమే.
త్రిష-విజయ్ చిన్న నాటి నుంచి స్నేహితులు. హీరో-హీరోయిన్లగా కొన్ని సినిమాలకు కలిసి పనిచేసారు. ఆ చనువుతోనే విజయ్ కోసం దర్శకుడు త్రిషని కోరగా స్పెషల్ సాంగ్ కి ఒకే చెప్పినట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.