త్రిషపై అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే బహీష్కృత నేత ఏవీ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. `గతంలో గౌవ త్తూరులో త్రిష ఓ ఫంక్షన్ కి హాజరైంది
By: Tupaki Desk | 20 Feb 2024 4:38 PM GMTహీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే బహీష్కృత నేత ఏవీ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. `గతంలో గౌవ త్తూరులో త్రిష ఓ ఫంక్షన్ కి హాజరైంది. స్థానిక ఎమ్మెల్యే వెంకటా చలం ఆమె పై మనసు పడి ఒకరోజుకి 25 లక్షలు చెల్లించి త్రిషతో గడిపాడు. దానికి నేనే సాక్ష్యం అంటూ` వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. దీంతో త్రిష పేరు నెట్టింట మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఏవీ రాజుపై త్రిష అభిమానులు మండిపడుతున్నారు.
ఎలాంటి ఆధారాలతో రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని భగ్గుమంటున్నారు. ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం త్రిష దృష్టికి వెళ్లడంతో ఆమె సీరియస్ అయింది. `ఫేమస్ అవ్వడం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయే జీవితాలు మీవి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టడనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిపై త్వరలోనే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఈ విషయంపై తన లీగల్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసింది. ఈ వివాదానికి ముందు త్రిష వర్సెస్ మన్సూర్ అలీఖాన్ వివాదం తెలిసిందే. `లియో` సినిమాలో తనకు త్రిష తో రేప్ సన్నివేశా లుంటాయని వ్యాఖ్యానించిన అంశంపై పెద్ద ఎత్తున దుమారం లేచిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం పై ఇరువురు న్యాయపోరాటం చేసారు. చివరికి కోర్టు మన్సూర్ అలీఖాన్ కి చీవాట్లు పెట్టడంతో వివాదం సద్దు మణిగింది. ఆ ఘటన మరువక ముందే త్రిష పేరు ఈ రకమంగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదం ఎంతవరకూ దారి తీస్తుందో? ఇక త్రిష నటిగా మళ్లీ బిజీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన `విశ్వంభర`లో నటిస్తోంది. స్టాలిన్ తర్వాత ఈ జోడీలో వస్తోన్న చిత్రమిది.