త్రిష మెరుపుల మురిపం మత్తెక్కిస్తుందే!
తాజాగా దుబాయ్ సైమా వేడుకలకు హాజరైన అమ్మడు డిజైనర్ దుస్తుల్లో మెరిసిన సంగతి తెలిసిందే. బ్లాక్ కలర్ డిజైన్ పై టాప్ లో సిల్వర్ కోటింగ్ అమ్మడిని సమ్ థింగ్ స్పెషల్ గా ప్రజెంట్ చేస్తుంది.
By: Tupaki Desk | 18 Sep 2023 5:57 AM GMT'పొన్నియన్ సెల్వన్' తర్వాత త్రిష మళ్లీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. కొత్త ప్రాజెక్ట్ లకు వరుస పెట్టి సంతకాలు చేస్తోంది. అంతకు ముందు వరకూ సెలక్టివ్ గా వెళ్లిన అమ్మడు పొన్నియన్ సెల్వన్ విజయం తర్వాత స్పీడ్ పెంచింది. అమ్మడి ఏజ్ కూడా 40 రావడంతో ఫేం ఉండగానే దున్నేయాలని కొత్త ప్రణాళికతో ముందుకు కదులుతోంది. ప్రస్తుతం త్రిష లైనప్ లో ఐదారు సినిమాలున్నాయి.
'రామ్ పార్ట్ -1' అనే చిత్రంతో మాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమా రిలీజ్ కి ముందే సెకెండ్ ఛాన్స్ కూడా చేజిక్కించుకుంది. 'ఐడెంటిఫై' అనే సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈరెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఇక అమ్మడు సోషల్ మీడియా కి కాస్త దూరంగానే ఉంటుంది. నవతరం నాయికలు..త్రిష తరం నటులంతా సోషల్ మీడియా హాట్ హాట్ ఫోటోలతో షేక్ చేస్తుంటే త్రిష మాత్రం చాలా అరుదుగానే కొత్త ఫోటోలు షేర్ చేస్తుంటుంది.
ఏదైనా ఈ వెంట్ కి హాజరైన స్పెషల్ పిక్స్ మాత్రం ఎక్కువగా దర్శనిస్తుంటాయి. త్రిష ఆ సమయంలో ఎంతో ప్రత్యకంగా ముస్తాబుతుంది. అమ్మడు అందాన్ని రెట్టింపు చేసే దుస్తుల్లో కనిపిస్తుంది. తాజాగా దుబాయ్ సైమా వేడుకలకు హాజరైన అమ్మడు డిజైనర్ దుస్తుల్లో మెరిసిన సంగతి తెలిసిందే. బ్లాక్ కలర్ డిజైన్ పై టాప్ లో సిల్వర్ కోటింగ్ అమ్మడిని సమ్ థింగ్ స్పెషల్ గా ప్రజెంట్ చేస్తుంది.
మ్యాచింగ్ ఇయర్ రింగ్స్..బ్రాస్లెట్ ఎంపిక చేసుకున్న యాక్సరీసీస్ ప్రతీది త్రిష అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అమ్మడి అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక త్రిష అందం వయసుతో పాటు రెట్టింపు అయిపోతున్నట్లే ఉంది. 40 ఏళ్లకు చేరుకున్నా బ్యూటీ లో ఎలాంటి మార్పులు రాలేదు. 25 ఏళ్ల ప్రాయంలో అలరించినట్లే ఆకట్టుకుంటుంది. త్రిష కూడా మంచి ఫిట్ నెస్ ప్రీక్. డైలీ యోగా..జిమ్ మిస్ చేయదు. క్రమం తప్పకుండా బ్యూటీకి కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.