Begin typing your search above and press return to search.

త్రిష.. ఇంకాస్త సన్నగా..

నాలుగు పదుల వయసులో యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతోంది సీనియర్ బ్యూటీ త్రిష

By:  Tupaki Desk   |   15 July 2024 11:30 PM GMT
త్రిష.. ఇంకాస్త సన్నగా..
X

నాలుగు పదుల వయసులో యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతోంది సీనియర్ బ్యూటీ త్రిష. వయసు అనే పదం.. పక్కన పెట్టేసి తన అందం చందాలతో రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రియులను అలరిస్తోంది. ఇప్పటికే అదే ఫామ్ ను కొనసాగిస్తోంది. మధ్యలో కొన్నాళ్లపాటు ఆమె కెరీర్ కాస్త నత్త నడకన నడిచినా.. ఇప్పుడు మళ్లీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ చిత్రాలతోపాటు స్టార్ హీరో విజయ్ దళపతి లియో మూవీ తర్వాత త్రిషకు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ విడా ముయరాచి సినిమాలో నటిస్తోంది. కమల్ హాసన్ - మణిరత్నం కాంబోలో వస్తున్న యాక్షన్ డ్రామా థగ్ లైఫ్ లో కూడా త్రిష భాగమైంది. విజయ్ గోట్ మూవీలో క్యామియో రోల్ చేస్తోంది.

అలా అటు తమిళంలో.. ఇటు తెలుగులో అనేక సినిమాల్లో నటిస్తోంది త్రిష. వరుస షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతోంది. విదేశాల్లో షూటింగ్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్లి.. మళ్లీ ఇండియా వస్తోంది. అయితే తాజాగా త్రిష.. సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్ ను షేర్ చేసింది. మిర్రర్ సెల్ఫీని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు ఉకియో అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో దాని అర్థమేంటో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ట్రై చేస్తున్నారు.

ఉకియో అనేది జపనీస్‌ వర్డ్. జపనీస్ లో ఉకియో అంటే తేలియాడే ప్రపంచం (ఫ్లోటింగ్ వరల్డ్‌) అని అర్థమని తెలుస్తోంది. అయితే త్రిష తాను జపాన్‌లో ఉన్నానని ఇన్ డైరెక్ట్ గా ఫ్యాన్స్ కు చెప్పిందన్నమాట. సినిమా షూటింగ్ కోసం వెళ్లిందా లేక పర్సనల్ ట్రిప్పా అనేది తెలియాల్సి ఉంది. అయితే పిక్ లో త్రిష బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. అమ్మడు చాలా సన్నమైందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ కొనియాడుతున్నారు. యంగ్ హీరోయిన్లకు మించిన అందంతో ఫిదా చేస్తుందని చెబుతున్నారు. వయసు అనేది.. త్రిషకు ఆఫ్టరాల్ అని అంటున్నారు. చెన్నై చంద్రం నయా సెల్ఫీపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. పిక్ పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే భారీ లైక్స్ వచ్చేశాయి. మొత్తానికి త్రిష.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో రానిస్తోంది. మరి వరుస సినిమాలతో సీనియర్ బ్యూటీ ఎలాంటి హిట్లు అందుకుంటుందో చూడాలి.