Begin typing your search above and press return to search.

అక్కడ ఇక్కడ ఆమెకు అడ్డులేకుండా పోయిందే..!

అదేంటో కానీ సౌత్ లో అనూహ్యంగా సీనియర్ హీరోయిన్స్ హవా మొదలైంది.

By:  Tupaki Desk   |   25 April 2024 5:53 AM GMT
అక్కడ ఇక్కడ ఆమెకు అడ్డులేకుండా పోయిందే..!
X

అదేంటో కానీ సౌత్ లో అనూహ్యంగా సీనియర్ హీరోయిన్స్ హవా మొదలైంది. స్టార్ హీరోయిన్స్ గా ఒకప్పుడు స్టార్స్ అందరితో నటించి సూపర్ అనిపించుకున్న స్టార్ హీరోయిన్స్ కాస్త పాత పడుతున్నా కొద్దీ వారి కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. ఆ టైం లో తమ స్పెషాలిటీ చాటుతూ వెరైటీ సినిమాలు చేస్తూ వస్తారు. తమ దాకా వచ్చిన కమర్షియల్ సినిమాలు చేస్తూ తమ ప్రత్యేకత చాటేలా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తుంటారు. అందుకే కొందరు హీరోయిన్స్ రెండు దశాబ్ధాలుగా కూడా కెరీర్ స్ట్రాంగ్ గా కొనసాగిస్తుంటారు.

అయితే మధ్యలో కొన్నాళ్లు టైం కలిసి రాకపోయినా అదే స్ట్రాంగ్ బిలీఫ్ తో ప్రయత్నిస్తుంటే మాత్రం మళ్లీ అవకాశాలు క్యూ కట్టేస్తుంటాయి. ప్రస్తుతం సౌత్ లో సీనియర్ హీరోయిన్స్ లో సూపర్ ఫాం లో ఉన్న బ్యూటీ త్రిష. నయనతార కాస్త స్లో అయిన వెంటనే త్రిష స్పీడ్ అందుకోవడంతో అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయి. కోలీవుడ్ లో దాదాపు నయనతారకు ప్రత్యామ్నాయం గా మారిన త్రిష టాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది.

తమిళంలో రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్న త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమా చేస్తుంది. ఈ సినిమాతో అమ్మడు తెలుగులో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. కోలీవుడ్ లో బిజీగా ఉండటం వల్ల తెలుగు ఆఫర్లను కాదనుకున్న త్రిష ఇప్పుడు తెలుగు పరిశ్రమ పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్న ప్రభంజనం చూసి ఇక్కడ అవకాశాలకు ఓకే అనేస్తుంది.

విశ్వంభర మాత్రమే కాదు త్రిష లైన్ లో రెండు భారీ తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తుంది. ఓ పక్క కోలీవుడ్ లో కూడా త్రిష సూపర్ ఫాం కొనసాగిస్తుంది. విశ్వంభర హిట్ అయితే మాత్రం త్రిష తెలుగులో మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. త్రిష తో పాటు అనుష్క, కాజల్ కూడా అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. నయనతార, కాజల్ ఉన్నా వాళ్లకు ఆల్రెడీ పెళ్లై పిల్లలు కూడా ఉన్న కారణంగా త్రిషని ఫస్ట్ ఛాయిస్ గా తీసుకుంటున్నారు. వారందరితో పోల్చితే త్రిష ఒక అడుగు ముందు ఉందని చెప్పొచ్చు. త్రిష ఈ ఫాం చూసి ఆమెను అభిమానించే తెలుగు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సీనియర్ స్టార్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా హీరోలతో కూడా త్రిష నటిస్తే చూడాలని వారు కోరుతున్నారు.