Begin typing your search above and press return to search.

లియో రక్తపాతం.. భయంతో త్రిష

ఇదిలా ఉంటే తాజాగా లియో మూవీ నుంచి త్రిష ఫస్ట్ లుక్ ని ప్రేక్షకుల ముందికి చిత్ర యూనిట్ తీసుకొచ్చింది. ఈ లుక్ యాక్షన్ సీక్వెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Oct 2023 9:56 AM GMT
లియో రక్తపాతం.. భయంతో త్రిష
X

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి సిద్ధమవుతోన్న మూవీ లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీ రెడీ అవుతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. లియో చిత్రంపై ఏకంగా 228 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఏకంగా 22 కోట్లకి రిలీజ్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ కొనుగోలు చేసింది.


డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే రెండు వందల కోట్లకి పైగా షేర్ రిటర్న్ వచ్చేసింది. విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కి హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న మూవీ కావడం, విజయ్ కెరియర్ ట్రాక్ రికార్డ్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావడానికి కారణం అయ్యింది.

ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. చివరిగా 2008లో వీరిద్దరూ కురువి సినిమాలో నటించారు. మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత లియో చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ కారణంగా మూవీపై మరింత బజ్ క్రియేట్ అవుతోంది. కచ్చితంగా లియో మూవీ కోలీవుడ్ ఇండస్ట్రీ హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా లియో మూవీ నుంచి త్రిష ఫస్ట్ లుక్ ని ప్రేక్షకుల ముందికి చిత్ర యూనిట్ తీసుకొచ్చింది. ఈ లుక్ యాక్షన్ సీక్వెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరో రక్తం ఒంటిపైన పడటంతో ఆ దృశ్యం చూస్తూ షాకింగ్ కి గురవుతున్నట్లు త్రిష ఎక్స్ ప్రెషన్ పోస్టర్ లో ఉంది. ఇక ఈ లుక్ లో త్రిష మునుపటి కంటే మరింత అందంగా కనిపిస్తోంది.

విజయ్, త్రిష స్క్రీన్ పెయిర్ ఈ మూవీలో కచ్చితంగా ఆకట్టుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే మూవీలో డ్యూయెట్స్ ఏమీ లేకుండానే లోకేష్ కనగరాజ్ సినిమా కథని నేరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథలో భాగంగానే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది తప్ప ప్రత్యేకంగా విజయ్ జోడీగా కాదనే టాక్ కూడా నడుస్తోంది.