Begin typing your search above and press return to search.

త్రిష రెమ్యునరేషన్.. ఆచితూచి..

రెమ్యునరేషన్ పరంగా కూడా అందుబాటులో ఉండటంతో స్టార్ హీరోలకి జోడీగా త్రిషని తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:03 AM GMT
త్రిష రెమ్యునరేషన్.. ఆచితూచి..
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల నుంచి తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ త్రిష. ఈ అమ్మడు కెరియర్ ముగిసిపోయింది అనుకున్న దశలో మరల పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో సత్తా చాటి రేసులోకి వచ్చింది. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. రెమ్యునరేషన్ పరంగా కూడా అందుబాటులో ఉండటంతో స్టార్ హీరోలకి జోడీగా త్రిషని తీసుకుంటున్నారు.

ఈ బ్యూటీ తమిళంలో విజయ్ కి జోడీగా లియో సినిమాలో నటించింది. ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అయ్యింది. ప్రస్తుతం అజిత్ తో ఒక సినిమా చేస్తోంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంభర మూవీలో త్రిష నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెది మెయిన్ లీడ్ గా ఉండబోతోంది. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

అలాగే మరో రెండు సినిమాలకి సైన్ చేసింది. అవి కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం నాలుగు సినిమాలు ప్రస్తుతం చేతిలో ఉన్నాయని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్స్ గా రేసులో ఉన్న వారికంటే ఎక్కువ మూవీస్ త్రిష ఇప్పుడు చేస్తోంది. ఒక్కో సినిమాకి 80 లక్షల నుంచి. 1.2 కోట్ల రెమ్యునరేషన్ ని త్రిష డిమాండ్ చేస్తోందంట. అంటే డేట్స్ బట్టి అలాగే కంటెంట్ బడ్జెట్ విషయాలను పరిగణనలోకి తీసుకొని, రెమ్యునరేషన్ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నట్లు టాక్.

ఇప్పుడు ఈమె ఖాతాలోకి మరో మూవీ వచ్చి చేరేలా కనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి మూవీ చేయబోతున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా త్రిషని ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. అదే జరిగితే వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో వచ్చే మూడో చిత్రం ఇది అవ్వనుంది.

గతంలో వెంకటేష్ తో త్రిష ఆడువారి మాటలకి అర్ధాలు వేరులే, నమో వెంకటేశాయా సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అనిల్ రావిపూడి మూవీ కాబట్టి వెంకటేష్, త్రిష కాంబోలో హ్యాట్రిక్ హిట్ మూవీగా మారిన ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం త్రిష స్పీడ్ చూస్తుంటే మరో ఐదేళ్ల వరకు ఆమె కెరియర్ లో ఎలాంటి డోకా లేనట్లు కనిపిస్తోంది. సీనియర్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా ఆమె మారుతోంది.