Begin typing your search above and press return to search.

త్రిష రెస్పాన్స్ కోసం వెయిటింగ్..!

కోలీవుడ్ భామ త్రిష కృష్ణన్ కెరీర్ ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్ లో ఉందని చెప్పొచ్చు. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం కెరీర్ మొదలు పెట్టిన అమ్మడు ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తుంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 1:30 AM GMT
త్రిష రెస్పాన్స్ కోసం వెయిటింగ్..!
X

కోలీవుడ్ భామ త్రిష కృష్ణన్ కెరీర్ ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్ లో ఉందని చెప్పొచ్చు. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం కెరీర్ మొదలు పెట్టిన అమ్మడు ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తుంది. మధ్యలో కొంత వెనక పడినట్టు అనిపించినా తిరిగి తన సత్తా చాటింది. ముఖ్యంగా తమిళంలో త్రిష స్టార్ డం కొనసాగుతూనే ఉంది. సౌత్ లో తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసిన త్రిష కోలీవుడ్ లో ఆ ఫాం కంటిన్యూ చేస్తుంది కానీ తెలుగు సినిమాలపై మాత్రం ఆసక్తి చూపట్లేదు.

ఆమధ్య ఒకటి రెండు సినిమాలు అనౌన్స్ మెంట్ చేశాక కూడా త్రిష ఎగ్జిట్ అయ్యింది. కారణాలు ఏవైనా త్రిష తెలుగు సినిమాలకు నో చెబుతుందని ఇన్నర్ టాక్. అయినా సరే ఆమెను తెలుగు సినిమాల్లో నటింపచేయాలని చూస్తున్నారు. లేటెస్ట్ గా త్రిషకు రెండు క్రేజీ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో ఒకటి బాలకృష్ణ సినిమా కాగా రెండోది త్రివిక్రం అల్లు అర్జున్ కాంబో సినిమా అని తెలుస్తుంది. బాలకృష్ణ బాబీ డైరెక్షన్ లో సినిమాలో హీరోయిన్ గా త్రిష ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

త్రిష అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఆమెను సినిమాలో నటింపచేయాలని చూస్తున్నారు. త్రివిక్రం బన్నీ సినిమాలో కూడా త్రిషకు మంచి పాత్ర ఉందని ఆఫర్ చేశారట. అయితే తనకు వచ్చిన ఈ రెండు సినిమాల ఆఫర్లను హోల్డ్ లో పెట్టింది త్రిష. ఆమె రెస్పాన్స్ కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. త్రిష ఓకే అంటే పర్వాలేదు లేకపోతే మరో హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నారు. వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న బాలయ్య సినిమాలో ఛాన్స్ అంటే త్రిషకు మరో గ్రాండ్ రీ ఎంట్రీ అని చెప్పొచ్చు.

ఇక త్రివిక్రం సినిమాలో అవకాశం అన్నా కూడా కచ్చితంగా ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుంది. అతడు సినిమా తర్వాత త్రివిక్రం తో కలిసి పనిచేయలేదు త్రిష. మరి ఈ ఆఫర్ ను ఓకే చేస్తుందా లేదా అన్నది చూడాలి. త్రిషని తెలుగు సినిమాల్లో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నా త్రిష మాత్రం అందుకు రెడీగా లేదన్నట్టు తెలుస్తుంది. మరి వచ్చిన ఈ రెండు ఆఫర్లలో త్రిష ఏదైనా ఓకే చేస్తుందా లేదా అన్నది చూడాలి. టాలీవుడ్ కి త్రిష తిరిగి వస్తే మాత్రం ఈ రెండే కాదు అరడజను సినిమాల దాకా ఆమె చేతికి వచ్చే అవకాశం ఉంది.