Begin typing your search above and press return to search.

త్రిష‌-స‌మంత‌..ఇద్ద‌రిలో ఎవ‌ర‌బ్బా?

కానీ ఇప్పుడామె ఉందా? ఆమె స్థానంలో స‌మంత‌ని తీసుకున్నారా? అన్న కొత్త డౌట్ రెయిజ్ అవుతోంది.

By:  Tupaki Desk   |   5 Jan 2024 7:07 AM GMT
త్రిష‌-స‌మంత‌..ఇద్ద‌రిలో ఎవ‌ర‌బ్బా?
X

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడి త‌మిళ ద‌ర్శ‌కుడు విష్ణు వ‌ర్ద‌న్ `ది బుల్` అనే చిత్రాన్ని తెర‌కెక్కి స్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టా త్మ‌కంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఎంపికైన‌ట్లు ఇప్ప‌టికే బాలీవుడ్ మీడియా స‌హా అన్ని మెయిన్ స్ట్రీమ్స్ లోనూ వైర‌ల్ అయింది. చిత్ర వ‌ర్గా ల‌నుంచి కూడా అది క‌న్ప‌మ్ అన్న‌ట్లే వ‌చ్చింది.

కానీ ఇప్పుడామె ఉందా? ఆమె స్థానంలో స‌మంత‌ని తీసుకున్నారా? అన్న కొత్త డౌట్ రెయిజ్ అవుతోంది. ఎందుకంటే స‌ల్మాన్ స‌ర‌స‌న స‌మంత‌ని ఎంపిక చేసిన‌ట్లు మ‌రో వార్త తెర‌పైకి వ‌చ్చింది. దీంతో స‌ల్మాన్ స‌ర‌స‌న అస‌లు హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. త్రిష‌ని ఎంపిక చేసారా? స‌మంత‌ని తీసుకున్నారా? లేద‌క ఇద్ద‌ర్నీ ఎంపిక చేసారా? అన్న కొత్త చ‌ర్చ నెట్టింట మొద‌లైంది. త్రిష ఇప్ప‌టికే బాలీవుడ్ లో `క‌ట్టా మిట్టా`తో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ హిందీలో సినిమా చేయ‌లేదు. ఆమెకి అవ‌కాశాలు వ‌చ్చి చేయ‌లేదా? రాక చేయ లేదా? అన్న‌ది తెలియ‌దుగానీ...సౌత్ లో మాత్రం కొన‌సాగింది. ఇక స‌మంత కొన్నాళ్ల‌గా బాలీవుడ్ అవకాశాల కోసం ఎంత సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తుందో? తెలిసిందే. ప్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ త‌ర్వాత `సీటా డెల్` సిరీస్ లో ఛాన్స్ అందుకుంది. ఇండియ‌న్ వెర్ష‌న్ `సీటాడెల్` కి ఎంతో ట‌ప్ కాంపిటీష‌న్ ఉన్నా? అందులో స‌మంత ఛాన్స్ అందుకుని స‌ర్ ప్రైజ్ చేసింది.

మ‌రి ఇప్పుడు `ది బుల్` లో త్రిష‌ని ప‌క్క‌కు నెట్టి! ఛాన్స్ త‌న్నుకుపోతుందా? అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం స‌మంత విశ్రాంతిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఖుషీ` ప్ర‌చారం ముగించుకుని అమ్మ‌డు విదేశాలు చెక్కేసిన సంగ‌తి తెలిసిందే. ఏడాది పాటు సినిమాలు చేయ‌న‌ని విరామం ప్ర‌క‌టించింది. కానీ కొన్ని నెల‌ల‌కే ఆమె పేరు మ‌ళ్లీ తెర‌పైకి రావ‌డం విశేషం.