హీరో పెళ్లి విషయంలో త్రిష చేసింది కరెక్టేనా?
అందాల నటి త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ కూడా దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2024 7:14 AM GMTఅందాల నటి త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ కూడా దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. `పొన్నియన్ సెల్వన్` తో కంబ్యాక్ అయిన బ్యూటీకిప్పుడు వరుసగా అవకాశాలు వరిస్తున్నాయి. తమిళ్ తో పాటు తెలుగు సినిమాలు జోరుగా చేస్తోంది. వయసు 40 దాటిన అందం అంతకంతకు రెట్టింపు అవుతుందే తప్ప కరిగిపోలేదని యువతలో ఫాలోయింగ్ చూస్తే తెలుస్తుంది. అయితే ఆమె ఇంతవరకూ పెళ్లి చేసుకోకపోవడం కూడా ఎప్పుడూ చర్చగానే కనిపిస్తుంది.
వ్యాపార వేత్త వరుణ్ మనియన్ తో నిశ్చితార్ధం వరకూ వెళ్లినా వివాహం కాలేదు. అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది. పెళ్లి అనే టాపిక్ లేకుండా పనిచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ హీరో పెళ్లి విషయంలో అడ్డు పడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడు ఎవరో కాదు నటుడు శ్రీరామ్. ఇతను తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. `ఒకరికి ఒకరు` సినిమాతో బాగా పాపులర్ అయిన నటుడు.
ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ పనిచేసాడు. త్రిష తో కలిసి `మనసెల్లామ్` అనే సినిమా కూడా చేసాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా కొనసాగుతుంది. అయితే అదే స్నేహంతో శ్రీరామ్ పెళ్లి ఆపాలని ట్రై చేసిందిట. 2007 లో శ్రీరామ్ వందన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ ఆపెళ్లి కుమార్తె త్రిషకి ముందే తెలుసు.
దీంతో శ్రీరామ్ సీక్రెట్ లు అన్నీ వందనకు పెళ్లికి ముందే చెప్పేసిందిట. అతడికి ఇంగ్లీష్ రాదు అని, మంచి వాడు కాదని, పెళ్లి చేసుకుంటే జీవితం పోతుందని చెప్పిందిట. కానీ వాటిని పట్టించుకోకుండా వందన శ్రీరామ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత ఇదే విషయాలు శ్రీరామ్ ముందు వందన ఉంచిందిట. త్రిష తారసపడిన సమయంలో ఇలా ఎందుకు చెప్పాడ్ అని శ్రీరామ్ అడిగితే అంతా ప్రాంక్...మీ ఆవిడ నమ్మేసిందా? నువ్వు నా ప్రెండ్ ని పెళ్లి చేసుకుంటున్నావ్ అందుకే అలా చెప్పి ఆట పట్టించానని త్రిష అనేసింది. ఇదే సీరియస్ అయితే సీన్ ఎలా ఉండేదో.