ఆ ముగ్గురికి థాంక్స్ చెప్పిన త్రిష
కానీ ఎవరికి వారు అన్నట్టుగా ఉండే ఇండస్ట్రీ కి చెందిన వారు త్రిష పై అతడు చేసిన వ్యాఖ్యలను ఖండించలేదు.
By: Tupaki Desk | 26 Feb 2024 5:14 AM GMTసౌత్ స్టార్ హీరోయిన్ త్రిష పై ఇటీవల ఒక తమిళ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై త్రిష లీగల్ పోరాటానికి సిద్ధం అయ్యింది. తనకు పరువు నష్టం కలిగించాడంటూ అతడిపై త్రిష కోర్టును ఆశ్రయించడం జరిగింది.
ఆ వివాదంలో త్రిష కు ఇండస్ట్రీ మొత్తం మద్దతుగా నిలవాల్సి ఉంది. కానీ ఎవరికి వారు అన్నట్టుగా ఉండే ఇండస్ట్రీ కి చెందిన వారు త్రిష పై అతడు చేసిన వ్యాఖ్యలను ఖండించలేదు. ఆ సమయంలో త్రిషకు కొద్ది మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. వారిలో నటుడు నాజర్, దర్శకుడు చేరన్ మరియు సముద్రఖని మాత్రమే ఉన్నారు.
ఆ ముగ్గురు కూడా త్రిష పై ఆ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం తో పాటు, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆ వివాదాల విషయంలో తనకు మద్దతుగా నిలిచిన ఆ ముగ్గురికి త్రిష ఇటీవల కృతజ్ఞతలు చెప్పింది. ఆ సమయంలో వారు ముగ్గురిని కూడా అన్నయ్యలుగా అభివర్ణిస్తూ త్రిష థాంక్స్ చెప్పింది.
త్రిష కు మరికొందరు సినీ సెలబ్రెటీలు కూడా ఆ తర్వాత మద్దతుగా నిలిచారు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వారిని అలా విమర్శించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ సదరు రాజకీయ నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు కూడా కొందరు త్రిషకి మద్దతుగా నిలిచిన విషయం తెల్సిందే.
గతంలో కూడా త్రిష ను నటుడు మన్సూర్ తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెల్సిందే. ఆయన వ్యాఖ్యల విషయంలో కూడా త్రిష కు పలువురు మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో త్రిష కు ప్రముఖులు మద్దతుగా నిలిచి ఆ వ్యాఖ్యలను ఖండించారు.
త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవ్వబోతుంది. అయినా కూడా ఇప్పటికి కూడా బీజీగానే సినిమాలు చేస్తోంది. చాలా రోజుల తర్వాత తెలుగు లో చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత మరిన్ని తెలుగు సినిమాలను త్రిష చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తమిళంలో కూడా రెండు మూడు సినిమాలు చేస్తోంది.