Begin typing your search above and press return to search.

త్రిష మైలురాయి కథ రాకపోవడమే మంచిదైందా?

ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలు ఇతర విషయాలను దర్శకుడు అరుణ్‌ వశీగరన్‌ ఆసక్తికరంగా మల్చడం లో విఫలం అయ్యాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 8:17 AM GMT
త్రిష మైలురాయి కథ రాకపోవడమే మంచిదైందా?
X

టాలీవుడ్ తో పాటు తమిళ్ లో స్టార్ హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలం కొనసాగిన ముద్దుగుమ్మ త్రిష. వయసు పెరుగుతున్నా కొద్ది మరింత అందంగా త్రిష కనిపిస్తుంది అంటూ అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో ఈమె సందడి తగ్గింది... కానీ కోలీవుడ్‌ లో మాత్రం జోరు కంటిన్యూ అవుతూనే ఉన్న విషయం తెల్సిందే.

సూపర్‌ స్టార్‌ విజయ్ లియో సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు పలు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటిస్తోంది. ఆ మధ్య పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలో నటించడం ద్వారా పాన్‌ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న త్రిష తాజాగా తమిళ్‌ లో 'ది రోడ్‌' అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఒక హైవే లోని మైలు రాయి వద్ద రెగ్యులర్‌ గా యాక్సిడెంట్స్‌ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది అంతు పట్టకుండా ఉంటుంది. త్రిష తన ఫ్యామిలీని అక్కడే రోడ్డు యాక్సిడెంట్ లో మిస్ అవుతుంది. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుంది... ఎందుకు అక్కడే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనే విషయం తెలుసుకునేందుకు రెడీ అవుతుంది.

ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలు ఇతర విషయాలను దర్శకుడు అరుణ్‌ వశీగరన్‌ ఆసక్తికరంగా మల్చడం లో విఫలం అయ్యాడు. అక్కడ త్రిష కి ఈ మధ్య మంచి సక్సెస్ లు పడ్డాయి. కానీ ఈ సినిమా మాత్రం నిరాశ పరిచింది. తెలుగు లో కూడా ఈ సినిమా ను మొదట విడుదల చేయాలని భావించారు... కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు లో డబ్బింగ్‌ రిలీజ్ ను స్కిప్ చేశారు.

ప్రముఖ నిర్మాత ఒకరు ది రోడ్‌ సినిమా హిట్ అయితే తెలుగు లో రీమేక్ చేయాలని భావించాడు. కానీ ఇప్పుడు అది లేనట్లే అనిపిస్తుంది. ది రోడ్‌ తెలుగు వర్షన్ రాకపోవడం మంచిదైంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ ఓటీటీ లో తెలుగు వెర్షన్ కూడా వస్తుంది కనుక చూస్తారు. థియేటర్‌ లకు వస్తే ఈ సినిమా కి కచ్చితంగా తీవ్ర నష్టం వచ్చి ఉండేది అనేది కొందరి అభిప్రాయం. త్రిష ముందు ముందు అయినా తెలుగు లో వస్తుందా అనేది చూడాలి.