Begin typing your search above and press return to search.

న‌ట‌సింహంతో త్రిష..ఇది అభామానుల్లో కాక‌!

టాలీవుడ్ లో ఆమె పేరు జోరుగా వినిపిస్తుంది. ఇప్ప‌టికే చిరంజీవి లైన‌ప్ లో ఉన్న సినిమాల విష‌యంలో త్రిష పేరు తెర‌పైకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 2:30 PM GMT
న‌ట‌సింహంతో త్రిష..ఇది అభామానుల్లో కాక‌!
X

కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో చ‌క్రం తిప్పిన త్రిష అటుపై కేవ‌లం కోలీవుడ్ కే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి...నాగార్జున‌..మ‌హేష్ లాంటి స్టార్ హీరోల‌తో రొమాన్స్ చేసిన బ్యూటీ కాల‌క్ర‌మంలో సొంత భాష‌కే అధిక ప్రాధాన్య‌త‌నిచ్చి అక్క‌డే సినిమాలు చేసింది. ఈనేప‌థ్యంలోనే లేడీ ఓరియేంటెడ్ నాయిక‌గానూ స‌త్తా చాటా ప్ర‌య‌త్నం చేసిందిగానీ...స‌క్సెస్ అవ్వ‌లేదు. ప్రేక్ష‌కులు ఆమెని సోలోగా యాక్సెప్ట్ చేయ‌లేదు. ఈ క్ర‌మంలో అవ‌కాశాలు త‌గ్గాయి.

కానీ 'పొన్నియిన్ సెల్వన్స స‌క్సెస్ తో అమ్మ‌డు ఒక్క‌సారిగా బౌన్స్ బ్యాక్ అయింది. ఆ సినిమాలో అమ్మ‌డి పెర్పార్మెన్స్ ..బ్యూటీ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియా లో ఫాలోవ‌ర్స్ ని పెంచుకోగ‌ల్గింది. ఈ క్ర‌మంలో విజ‌య్ తో న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. అదే `లియో`. ఇందులో అమ్మ‌డు అందంతో మ‌రోసారి ఫిదా చేసింది. ఆ సినిమా స‌క్స‌స్ స‌హా బ్యూటీ త్రిష‌ని మ‌ళ్లీ బిజీ నాయిక‌గా మారుస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

టాలీవుడ్ లో ఆమె పేరు జోరుగా వినిపిస్తుంది. ఇప్ప‌టికే చిరంజీవి లైన‌ప్ లో ఉన్న సినిమాల విష‌యంలో త్రిష పేరు తెర‌పైకి వ‌చ్చింది.ఈ నేప‌థ్యంలో తాజాగా న‌ట‌సింహ బాల‌కృష్ణ స‌ర‌స‌న ఆమెని లాక్ చేసిన‌ట్లు వినిపిస్తుంది. త్వ‌ర‌లో బాల‌య్య బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాల‌య్య‌కి జోడీగా త్రిష అయితే బాగుంటుంద‌ని బాబి స‌హా నిర్మాత నాగ వంశీ భావిస్తున్నారుట‌.

త్రిష లాక్ అయితే అభిమానుల‌కు స్వీట్ న్యూస్ అనే చెప్పాలి. ఇంత‌వ‌ర‌కూ అమ్మ‌డు బాల‌య్య‌తో జ‌త క‌ట్టింది లేదు. ఆ జోడీని తెర‌పై చూడాల‌ని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. బాల‌య్య వ‌య‌సుని సైతం ప‌క్కాగా మ్యాచ్ చేయ‌గ‌ల న‌టి. అదే జ‌రిగితే తెర‌పై ఈ జంట క్రేజీగానే ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ బాల‌య్య‌ని ఎక్కువ‌గా న‌య‌న‌తార‌..ప్ర‌గ్యాజైశ్వాల్ లాంటి హీరోయిన్ల‌తోనే ఎక్కువ‌గా చూసాం. త్రిష కూడా తోడైతే! తెర మ‌రింత నిండుగా ఉంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.