ఇదేం అయ్యే పనిలా లేదుగా..?
త్రివిక్రం తో సినిమా అనుకున్న అల్లు అర్జున్ అట్లీతో మూవ్ ఆన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఐతే అల్లు అర్జున్ అట్లీ సినిమా పూర్తయ్యే దాకా త్రివిక్రం వెయిట్ చేస్తారా మరో హీరోతో కానిచ్చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
By: Tupaki Desk | 8 March 2025 9:27 AM ISTమాటల మాంత్రికుడు త్రివిక్రం తో సినిమా కోసం స్టార్ హీరోలంతా ఎదురుచూస్తుంటారు. రైటర్ కం డైరెక్టర్ గా త్రివిక్రం కథలు చాలా సింపుల్ గా ఉంటూనే ఆడియన్స్ హృదయాలను టచ్ చేస్తాయి. ముఖ్యంగా ఎమోషన్స్ తో ఆయన ఆడించే ఆట ఒక రేంజ్ లో ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ తో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం సినిమా చేసిన త్రివిక్రం నెక్స్ట్ సినిమా అసలైతే అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. కానీ ఎందుకో అది కాస్త టైం పడుతుందని తెలుస్తుంది.
త్రివిక్రం తో సినిమా అనుకున్న అల్లు అర్జున్ అట్లీతో మూవ్ ఆన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఐతే అల్లు అర్జున్ అట్లీ సినిమా పూర్తయ్యే దాకా త్రివిక్రం వెయిట్ చేస్తారా మరో హీరోతో కానిచ్చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే గత కొన్నాళ్లుగా త్రివిక్రం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేస్తాడన్న వార్త వైరల్ అవుతుంది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ అంటే త్రివిక్రం కు చాలా అభిమానం.
ఆయన చెబితే రామ్ తో త్రివిక్రం సినిమా చేసేస్తాడు. కానీ ఈ కాంబినేషన్ సినిమా ఇంకా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. అసలు ఈ ఇద్దరు కలిసి సినిమా చేయాలన్న ఆలోచన చేయలేదని. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలుస్తుంది. రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ లాక్ చేశారట.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో రామ్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమా షూటింగ్ దశలోనే మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ కూడా ఆడియన్స్ కు బాగా నచ్చేసింది. మరి రాం ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ఐతే రాం తో త్రివిక్రం సినిమా అన్నది కేవలం గాలి వార్త మాత్రమే కానీ అందులో ఏమాత్రం నిజం లేదని అంటున్నారు.
త్రివిక్రం ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా కోసమే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అట్లీ సినిమా సగం పూర్తయ్యాక త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రం సినిమా అంటే ఆడియన్స్ కు మంచి జోష్ వస్తుంది.