Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్, పవన్.. బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు

యాక్టివిస్టు కమ్ హ్యూమనిస్టు బాబు గోగినేని.. బిగ్‌ బాస్ సీజన్ లో పార్టిసిపేట్ చేసి పాపులర్ అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2024 12:32 PM GMT
త్రివిక్రమ్, పవన్.. బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు
X

యాక్టివిస్టు కమ్ హ్యూమనిస్టు బాబు గోగినేని.. బిగ్‌ బాస్ సీజన్ లో పార్టిసిపేట్ చేసి పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఎలాంటి భయం లేకుండా ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారని కొందరు అంటుంటారు. ఎప్పటికప్పుడు పలు ఇంటర్వ్యూల్లో కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.

"నేను ఇప్పటికే పలుమార్లు చెప్పాను. సినిమాల్లో డైలాగులు రాసేవారు.. డేంజరెస్ డైలాగ్స్ రాస్తున్నారు. అందరూ గురూజీ అంటారు. నేను డర్టీ ఫెలో అంటాను. ఎందుకుంటే.. అతడి డైలాగ్స్ వల్లే. 2008లో వచ్చిన జల్సా సినిమాలో పడుకున్న అమ్మాయిని రే*ప్ చేస్తే ఏం మజా వస్తుంది రా.. పరిగెడుతున్నప్పుడు చేయాలి అని త్రివిక్రమ్ రాశాడు.. అతడు గురూజీనా.. దీని బట్టి ఏం తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ నుంచి!" అంటూ బాబు గోగినేని.. త్రివిక్రమ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

"హీరోయిన్ ను సెట్స్ పై కొట్టాడు ఒకడు.. తుపాకీతో బెదిరించడానికి మీడియా ఆఫీస్ కు వెళ్లాడు.. అంటూ పలు విషయాలను స్టోరీలుగా చెప్పుకుంటున్నారు. నేరాలు ఘోరాలు రిపోర్టులు కావు. అలా చేశాడట.. ఏం మనిషి.. ఏం ధైర్యం.. అంటూ మాట్లాడుకుంటున్నారు. తెలుగు జాతి.. రెండు గంటలు టీవీ చూసి నిద్రపోతారు.. అన్యాయం జరుగుతున్న వారి తరఫున పోరాడే వారు నాకు కనిపించడం లేదు. టీవీ షో చూసేసి సోషల్ మీడియాలో నాలుగు కామెంట్లు పెట్టి.. అదే యాక్షన్ అనుకుంటున్నారు" అని ఆరోపించారు.

"మిస్ బిహేవ్ చేసిన వాళ్లను ఎవరినీ ఎదుర్కోకపోవడం బిగ్ ఛాలెంజ్. అలా చేశాడట.. అని అలా మాట్లాడుకుంటున్నారు. కానీ అది చాలా బాధాకరం. లడ్డూ గోల చాలా చూస్తున్నాం. అందరూ బాధపడుతుంటే నాకు బాధ అనిపించింది. ప్రభుత్వంలో ఉన్న వారు చర్యలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయనెవరు.. జల్సా సినిమాలో ఆడవారిపై రే*ప్ ఎలా చేయాలో డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్" అని ఆరోపించారు.

"ఆ సీన్ లో యాక్ట్ చేసింది టాలీవుడ్ పెద్ద మనిషి బ్రహ్మానందం గారు. ఇదంతా చూసి చప్పట్లు కొడుతుంది కోట్ల మంది తెలుగు ప్రజలు. ఈ కల్చర్ ఏదైతే ఉందో.. దీన్ని నివారించాలి. నాకు సినిమాలకు ఎక్కువ పరిచయం లేదు. ఒకప్పుడు రివ్యూలు రాశాను. అవి కూడా ఫారిన్ సినిమాలకు రాశాను. ఫ్రెంచ్ లో ఒక యాక్టర్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. అతడు బెల్జియం వెళ్లి దాక్కున్నాడు. మరో అమెరికా యాక్టర్ కూడా అలాగే చేశాడు. స్విట్జర్లాండ్ లో దాక్కున్నాడు. ఈ రంగంలో లైంగిక ఆరోపణలు ఎక్కువే" అని అభిప్రాయపడ్డారు.

"నేను చూసింది ఏంటంటే.. 1970 స్ 1980 స్ సినిమా రంగాల్లో ఇలాంటివి లేవు. కానీ తెలుగు సినిమా రంగంలో హీరో హీరోయిన్ మధ్య ఎఫైర్ లు మాత్రమే ఉండేవి. సినిమాలో కూడా అంతేగా.. హీరోకు ఇద్దరు భార్యలు.. ఒక భార్యకు కష్టం అయితే మరో భార్య కర్చీఫ్ తో ఓదార్చడం.. ముఖ్యంగా పెద్ద సినిమా యాక్టర్లకు.. వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో కానీ.. కనపడిన ప్రతి యంగ్ స్టర్ ను ఒక్కరిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాలని అనే వారిని మనం చూడలేదు" అని అన్నారు.