అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్డేట్
దీంతో బన్నీ తర్వాత ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అందరికీ పెరిగిపోయింది. పుష్ప2 రిలీజ్ కు ముందు బన్నీ పుష్ప3 చేస్తాడన్నారు కానీ అది ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లదని తేలిపోయింది.
By: Tupaki Desk | 14 Feb 2025 4:46 AM GMTపుష్ప సినిమాతో తన క్రేజ్ ను నేషనల్ లెవెల్ లో పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 తో దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లాడు. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో బన్నీ మార్కెట్, ఫాలోయింగ్ చాలా బాగా పెరిగింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా వరల్డ్ వైడ్ గా పుష్ప రాజ్ తన సత్తా చాటాడు. పుష్ప2 సినిమా రూ.1800 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను సృష్టించింది.
దీంతో బన్నీ తర్వాత ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అందరికీ పెరిగిపోయింది. పుష్ప2 రిలీజ్ కు ముందు బన్నీ పుష్ప3 చేస్తాడన్నారు కానీ అది ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో బన్నీ తర్వాత చేయబోయే డైరెక్టర్ల లిస్టులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరుతో పాటూ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ పేరు వినిపిస్తుంది.
బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానున్నట్టు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ సడెన్ గా అట్లీ లైన్ లోకి రావడం, అట్లీ చెప్పిన కథ బన్నీకి సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఆ కథను అట్లీ వేరే హీరోతో చేయాలనుకోవడం, మళ్లీ రీసెంట్ గా అట్లీ బన్నీకి కథ చెప్పాడని వార్తలు రావడంతో బన్నీ తర్వాతి సినిమాను ఎవరితో చేయనున్నాడనేది అయోమయంగా మారింది.
అయితే అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్ తోనే చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రీసెంట్ గానే త్రివిక్రమ్, అల్లు అర్జున్ ను కలిసి సినిమాకు సంబంధించిన ఫుల్ నెరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మైథలాజికల్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తాడని చెప్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ల తర్వాత బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అందరికీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.