Begin typing your search above and press return to search.

బ‌న్నీ అట్లీ మ‌ధ్య‌లో గురూజీ కొత్త హీరో!

అంటే వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ త‌ర్వాతే బ‌న్నీ -అట్లీ సినిమా రిలీజ్ కు అవ‌కాశం ఉంది.

By:  Tupaki Desk   |   10 March 2025 11:43 AM IST
బ‌న్నీ అట్లీ మ‌ధ్య‌లో  గురూజీ కొత్త హీరో!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ ప్రాజెక్ట్ ముందుగా ప‌ట్టాలెక్క‌డం దాదాపు ఖాయ‌మై పోయింది. ఇంకా అధికారిక ప్ర‌న‌ట రాలేదు గానీ....సన్నిహితుల నుంచి అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం అట్లీ వేస‌వితో త‌ర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి ఎలా లేద‌న్నా? ఏడాదిన్నర స‌మ‌యం ప‌డుతుంది. అంటే వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ త‌ర్వాతే బ‌న్నీ -అట్లీ సినిమా రిలీజ్ కు అవ‌కాశం ఉంది.

అంత‌వ‌ర‌కూ రిలీజ్ మాట ఎత్తాల్సిన ప‌నిలేదు. మ‌రి త్రివిక్ర‌మ్ అప్ప‌టివ‌ర‌కూ బ‌న్నీ కోసం ఎదురు చూస్తాడా? ఆ మైథ‌లాజిక‌ల్ క‌థ‌కే మెరుగులు దిద్దుతాడా? అంటే నో ఛాన్సే అంటున్నాయి ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు. బ‌న్నీతో సినిమా చేయ‌డానికి ముందు త్రివిక్ర‌మ్ మ‌రో సినిమా చేయాల‌ని ఆలోచ‌న చేస్తున్నాడుట‌. దీన్ని హాసిని హారికా క్రియేష‌న్స్ నిర్మించ‌నుంద‌ని తెలుస్తోంది.

గురూజీ సినిమా అదే సంస్థ నిర్మించ‌డం అన్న‌ది ప‌రిపాటే. ఈప్రాజెక్ట్ ను గురూజీ బ‌న్నీ త‌న సినిమా సెట్స్ కు వ‌చ్చే లోపు పూర్తి చేసి రిలీజ్ చేయాలి. అంటే ఏడాదిన్న‌ర స‌మ‌యంలో అది జ‌రిగిపోవాలి. గురూజీకి అదేం పెద్ద విష‌యం కాదు. ఇప్ప‌టికే అత‌డి వ‌ద్ద రెండు క‌థ‌లు సిద్దంగా ఉన్నాయని, అందులో ఓదాన్ని తెర‌పైకి తెచ్చే అవ‌కాశం ఉంది. అయితే ఇక్క‌డ హీరో సెట్ అవ్వ‌డం అన్న‌ది ముఖ్యం. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌హేష్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, ఎన్టీఆర్ వీళ్లంతా కూడా బిజీ. టైర్ 2 హీరోలు, నాని, నాగ‌చైత‌న్య లాంటి వారి షెడ్యూల్ కూడా ఏడాదిన్న‌ర పాటు ఖాళీగా లేదు.

మ‌రి ఆప్ష‌న్ గా ఎవ‌రు ఉన్నారంటే? రామ్, శ‌ర్వానంద్, నితిన్ లాంటి హీరోలున్నారు. త్రివిక్ర‌మ్ నుంచి పిలుపొస్తే కాద‌న‌కుండా వ‌చ్చి సినిమా చేస్తారు. ఈ ముగ్గురు కూడా ఫాం కోల్పోయారు. స‌క్సెస్ కోసం పోరాటం చేస్తున్నారు. మాస్ రాజా ర‌వితేజ కూడా స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తున్న వారే. ఆయ‌న్ని పిలిచినా కాద‌నడు. మ‌రి గురూజీ మైండ్లో ఎవ‌రున్నారో చూడాలి.