Begin typing your search above and press return to search.

గురూజీ టాలీవుడ్ నయా చీఫ్ గెస్ట్..!

త్రివిక్రం మైక్ అందుకుంటే ఆయన ఇచ్చే స్పీచ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. లక్కీ భాస్కర్ ఈవెంట్ లో గురూజీ ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 1:40 PM GMT
గురూజీ టాలీవుడ్ నయా చీఫ్ గెస్ట్..!
X

ఒక సినిమా జనాల్లోకి వెళ్లాలంటే దానికి సరైన ప్రమోషన్స్ చాలా అవసరం. స్టార్ సినిమాలకు ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా వారికి ఉన్న ఫ్యాన్ బేస్ తో నడిచిపోతుంది. కానీ కొన్ని సినిమాలకు ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తేనే కానీ వర్క్ అవుట్ అవ్వదు. సినిమా తీయడం ఒక లెక్క అయితే దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు అనేట్టుగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు అదిరిపోయే ప్రమోషనల్ యాక్టివిటీస్ తో వస్తుంటారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ గెస్ట్ ల పైన కూడా సినిమా రీచింగ్ ఉంటుంది.

అందుకే ప్రతి ఒక్కరు స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ హీరోనో చీఫ్ గెస్ట్ గా పిలిచి సినిమాను ఇంకాస్త జనాల్లోకి వెళ్లేలా చేస్తారు. ఐతే ఈమధ్య ఆ బాధ్యత మన స్టార్ డైరెక్టర్ గురూజీగా పిలవబడే త్రివిక్రం శ్రీనివాస్ తీసుకున్నాడని అనిపిస్తుంది. ఈమధ్యనే ఆయన అలియా భట్ నటించిన జిగ్రా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. త్రివిక్రం మార్క్ స్పీచ్ ఇస్తాడని అనుకోగా తన మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు అని గుంటూరు కారం తన రైటింగ్స్ మీద రివర్స్ పంచ్ వేశాడని అనిపించింది.

ఇక ఇప్పుడు గురూజీ మరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నారని తెలుస్తుంది. అది దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా ఈవెంట్ కు త్రివిక్రం అతిథిగా వస్తున్నారు. ఐతే ఈ సినిమా నిర్మాణంలో ఆయన సతీమణి సౌజన్య భాగం అవ్వడం వల్లే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నారా అన్నది పక్కన పెడితే గురూజీ అటెండన్స్ తో లక్కీ భాస్కర్ ఈవెంట్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. త్రివిక్రం ఈవెంట్ కి వచ్చే కారణాలు ఏవైనా సరే గురూజీ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

త్రివిక్రం మైక్ అందుకుంటే ఆయన ఇచ్చే స్పీచ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. లక్కీ భాస్కర్ ఈవెంట్ లో గురూజీ ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు. ఈమధ్యనే రిలీజైన ట్రైలర్ సినిమాపై బజ్ పెంచగా ఈ సినిమా దుల్కర్ కి హ్యాట్రిక్ హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులకు అందుబాటులో రానుంది.