త్రివిక్రమ్ కు మల్టీస్టారర్ రిక్వెస్ట్
వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్స్ లోకి వస్తోంది.
By: Tupaki Desk | 9 Oct 2024 4:44 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన ‘జిగ్రా’ అనే మూవీ దసరాకి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాని హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాని తెలుగులో సమర్పిస్తున్నారు. స్పై థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ ఉండబోతోంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక అన్న కోసం చెల్లెలు చేసే ఫైట్ గా ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్స్ లోకి వస్తోంది.
తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. చాలా రోజుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత ఈవెంట్ కి గెస్ట్ గా రావడం విశేషం. సమంత ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అలియా భట్ సమంతపై ప్రశంసలు కురిపించింది. సమంత ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా హీరోగా నిలబడిందని అలియా భట్ ప్రశంసించింది. డామినేషన్ వరల్డ్ గా సర్వైవ్ అవ్వడం అంత ఈజీ కాదని, నీ కష్టం, ప్రయాణం అందరికి ఆదర్శం అని చెప్పుకొచ్చింది.
అలాగే సమంతతో కలిసి ఒక సినిమాలో నటించాలని అనుకుంటున్నాను. త్రివిక్రమ్ సర్ కథ రాసి దర్శకత్వం వహిస్తే ఎప్పుడైనా నేను సిద్ధం అంటూ అలియా భట్ రిక్వెస్ట్ పెట్టింది. నేను మూవీ ప్రమోషన్స్ కోసం ఈ విషయం చెప్పడం లేదని, మనస్పూర్తిగా నా మనసులో మాటని పంచుకుంటున్న అని అలియా భట్ స్టేజ్ పైనే త్రివిక్రమ్ ని అడిగింది. దానిని త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ కావడం విశేషం. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సమంత ఉద్దేశించి ఈ ఈవెంట్ లో ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ముంబై నుంచి అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా రావాలని సమంతని త్రివిక్రమ్ కోరారు. నువ్వు చేయవేమో అనుకోని ఇక్కడ ఎవరు నీ కోసం క్యారెక్టర్స్ రాయడం లేదు. తెలుగు సినిమాలు చేస్తానంటే చాలా మంది నీతో వర్క్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. ఎవరైనా క్యారెక్టర్స్ రాస్తే కచ్చితంగా వస్తానంటూ సమంత కూడా త్రివిక్రమ్ కి సైగలతో సమాధానం చెప్పడం విశేషం.
ఇక ‘జిగ్రా’ ప్రమోషన్స్ లో అలియా భట్ రిక్వెస్ట్ ని త్రివిక్రమ్ కాస్తా సీరియస్ గా తీసుకుంటే మాములుగా ఉండదు. ఈ ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్ తో మూవీ చేస్తే కచ్చితంగా అది పాన్ ఇండియా లెవల్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి అది సాధ్యం అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.