Begin typing your search above and press return to search.

ఎంత పనిచేశావ్ త్రివిక్రమ్ 'బ్రో'​.. చూసుకోబడలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య అనుబంధం గురించి తెలిసిందే. పవన్ వేసే ప్రతి అడుగులో.. వెనక త్రివిక్రమ్​ ఉంటాడని చిత్రపరిశ్రమలో టాక్ ఉంది.

By:  Tupaki Desk   |   30 July 2023 8:11 AM GMT
ఎంత పనిచేశావ్ త్రివిక్రమ్ బ్రో​.. చూసుకోబడలే
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య అనుబంధం గురించి తెలిసిందే. పవన్ వేసే ప్రతి అడుగులో.. వెనక త్రివిక్రమ్​ ఉంటాడని చిత్రపరిశ్రమలో టాక్ ఉంది. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా.. త్రివిక్రమ్ గురించి చెప్పే మాటలు వింటే అదే అనిపిస్తుంది. అందుకే పవన్‌తో సినిమా చేయాలంటే.. ముందుగా త్రివిక్రమ్‌ను ఒప్పించాల్సి ఉంటుందని బయట టాక్ వినిపిస్తుంటంది. అయితే ఇప్పుడు 'బ్రో' సినిమాకు స్క్రీన్​ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్​పై పవన్ ఫ్యాన్స్​ ఫుల్ గుస్సా అవుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన 'బ్రో'.. ఈ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజైంది. యాక్టర్ కమ్ డైరెక్టర్​ సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వస్తోంది. తమిళంలో సూపర్ హిట్​గా నిలిచిన 'వినోదయ సీతమ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. అయితే.. మొదట.. సముద్ర ఖనితో పవన్ సినిమా ఏంటి? అని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత త్రివిక్రమ్ వల్లే ఈ ప్రాజెక్ట్ సెట్ ఓకే అయిందని సముద్రఖని చెప్పిన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్​కు ఈ కథ చెప్పగా.. పదే నిమిషాల్లో కథను మార్చేసి.. పవర్ స్టార్ అయితే నీకు ఓకేనా అంటూ.. సినిమాను సెట్​ చేశారని సముద్రఖని చెప్పారు. ఇప్పుడా ఆ పది నిమిషాల ఎఫెక్టే ఇప్పుడు 'బ్రో' రిజల్ట్​పై పడిందని అంతా అంటున్నారు. పవన్ లాంటి పెద్ద హీరో సినిమాకు చేసేటప్పుడు, వందల కోట్ల మార్కెట్ ఉన్న ఓ హీరో ఇలానే క్షణాల్లో సెట్ చేసేస్తారా? పవన్ క్రేజ్, మార్కెట్ ఆలోచించాలి కదా అని విమర్శిస్తున్నారు.

వాస్తవానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఓ స్ట్రైట్ సినిమా చేసి చాలా రోజులే అవుతోంది. పవన్ సినిమాలకే పనిచేస్తున్నారు. మహేశ్ గుంటూరు కారాన్ని కూడా కాస్త పక్కనపెట్టి మరీ చిత్రాలు చేస్తున్నారు. ఆ మధ్యలో భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ అందించిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బాగా హిట్ అయ్యాయి. దీంతో బ్రో సినిమాపై అంచనాలు ఏర్పాడ్డాయి. కానీ థియేటర్లో ఎక్కడా త్రివిక్రమ్ మార్క్ అస్సలు కనిపించలేదు. డైలాగ్స్ పేలలేదు.

అప్పుడెప్పుడో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ మాట అన్నారు. పవన్ తీసిన సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను తీసుకొచ్చి..ఓ చోట చేరిస్తే సినిమా హిట్ అవుతుంది అని. ఇప్పుడు బ్రో మూవీ​ పరిస్థితి అలానే ఉందని చెబుతున్నారు. వింటేజ్ పవన్‌ను చూపించేసి.. కథలో మ్యాటర్ లేకుండా చేసేశారని అంటున్నారు. ఫైనల్​గా త్రివిక్రమ్.. దీన్ని ఓ కమర్షియల్ ప్రాజెక్ట్​గా చేశారు కానీ.. పవన్ కెరీర్​లో ఓ మంచి సినిమాగా మిగిలిపోవాలని మాత్రం చేయలేదని పేర్కొంటున్నారు.