Begin typing your search above and press return to search.

తెర వెనుక త్రివిక్రమ్.. ఎందుకలా..?

తెర వెనుక మొత్తం సినిమా నడిపించిన త్రివిక్రమ్ ఇలా ఎందుకు చేశాడు అన్నది ఎవరికి అర్థం కాలేదు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 7:02 AM GMT
తెర వెనుక త్రివిక్రమ్.. ఎందుకలా..?
X

తమిళ సినిమా వినోదయ సీతం కోలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించగా ఆ సినిమా ను తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు త్రివిక్రమ్. అక్కడ నటించి డైరెక్ట్ చేసిన సముద్రఖని ని తీసుకొచ్చి ఇక్కడ కేవలం డైరెక్షన్ చేయించి తెర వెనుక కథ మొత్తం నడిపించాడు త్రివిక్రమ్.

అక్కడ వినోదయ సీతం ని ఇక్కడ బ్రో గా మార్చింది ఆయనే. ప్రాజెక్ట్ లోకి పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి సినిమా రేంజ్ పెంచారు. త్రివిక్రమ్ మాట చెప్పాడనే పవన్ ఈ సినిమా కు ఓకే చెప్పారు. తన బిజీ షెడ్యూల్ లో బ్రో కోసం కేవలం 25 రోజులు మాత్రమే కేటాయించాడు.

బ్రో సినిమా సాయి ధరం తేజ్ కూడా నటించాడు. ఈ సినిమా తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి చాలా దగ్గరగా ఉందని అనిపిస్తుంది. రెండేళ్ల క్రితం సాయి తేజ్ యాక్సిడెంట్.. దాదాపు 3 నెలల పాటు కోమాలో ఉండటం తెలిసిందే. సాయి తేజ్ కోసమే ఈ సినిమా చేసినట్టు అనిపిస్తుంది. బ్రో సినిమా విషయంలో త్రివిక్రమ్ కాంట్రిబ్యూషన్ ఎంత అన్నది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అయితే ఈ సినిమా కు కథ అనువాదంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్నిటినీ పొందుపరిచి మెప్పించాడు.

బ్రో సినిమా కు త్రివిక్రమ్ తెర వెనుక చేసిన కష్టం అంతా తెర మీద కనిపిస్తుంది. అయితే పవన్ సాంగ్స్ అన్నిటినీ కలిపి కొట్టాడన్న టాక్ వినిపిస్తున్నా అది ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందిస్తుంది. అయితే త్రివిక్రమ్ ఇంత కష్టపడినా సరే సినిమా ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ అవలేదు.

బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ కనిపించలేదు. సరే అప్పుడు బిజీ ఏమో అనుకున్నా సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ లో కూడా త్రివిక్రమ్ తనకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నాడు. తెర వెనుక మొత్తం సినిమా నడిపించిన త్రివిక్రమ్ ఇలా ఎందుకు చేశాడు అన్నది ఎవరికి అర్థం కాలేదు.

ఓ పక్క మహేష్ గుంటూరు కారం సినిమా కోసం త్రివిక్రమ్ పనిచేస్తున్నాడు. బ్రో సినిమా కోసం త్రివిక్రమ్ కూడా పవన్ లానే పార్ట్ టైం వర్క్ చేశాడు. అదీగాక సముద్రఖనితో ఉన్న ర్యాపో వల్ల త్రివిక్రమ్ తెర మీదకు వస్తే క్రెడిట్ అంతా తనకే వస్తుందని ముందు సముద్రఖని ని ఉంచి త్రివిక్రమ్ మిగతా అంతా నడిపించాడని అనిపిస్తుంది. బ్రో విషయంలో త్రివిక్రమ్ క్రెడిట్ తీసుకోకపోవడం వెనుక రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ త్రివిక్రమ్ కాంట్రిబ్యూషన్ ని ఫ్యాన్స్ గుర్తిస్తున్నారు.