Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కోసం అతనొక్కడే..?

ఇన్నాళ్లు ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టే కథలు అల్లిన గురూజీ ఈసారి కొత్తగా ఒక కాన్సెప్ట్ ని తీసుకు రాబోతున్నాడని టాక్.

By:  Tupaki Desk   |   12 Aug 2024 6:31 AM GMT
అల్లు అర్జున్ కోసం అతనొక్కడే..?
X

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా ఏంటి.. అసలు ఐకాన్ స్టార్ ప్లానింగ్ ఎలా ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 పూర్తి చేశాక అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు. ఒకరిద్దరు దర్శకుల పేర్లు వినపడుతున్నా అల్లు అర్జున్ అండ్ టీం ఎందుకు సైలెంట్ గా ఉంది ఈ విషయాల గురించి అల్లు ఫ్యాన్స్ అంతా కాస్త కంగారు పడుతున్నారు. ముందు పుష్ప 2 ని అనుకున్న డేట్ కి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు అల్లు అర్జున్. ఐతే ఈలోగా తమ హీరో నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఎవరితో చేసినా చేయకపోయినా త్రివిక్రం తో అయితే చేస్తాడన్న క్లారిటీ అయితే ఉంది. ఆల్రెడీ ఈ కాంబో సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అల్లు అర్జున్ తో త్రివిక్రం ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు కొట్టగా ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నారు. తమిళ దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలన్న ఆసక్తి చూపించినా ఎందుకో అవి అంతగా వర్క్ అవుట్ కాలేదు.

అందుకే అల్లు అర్జున్ కి ఉన్న ఏకైక ఆప్షన్ త్రివిక్రం అనే తెలుస్తుంది. త్రివిక్రం కూడా అల్లు అర్జున్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇన్నాళ్లు ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టే కథలు అల్లిన గురూజీ ఈసారి కొత్తగా ఒక కాన్సెప్ట్ ని తీసుకు రాబోతున్నాడని టాక్. ఈమధ్య వచ్చిన కల్కి సినిమా తో ఆడియన్స్ ఎలాంటి సినిమా అయినా సరే విజువల్ ఫీస్ట్ అందిస్తే తప్పకుండా చూసి ఆదరిస్తామని ప్రూవ్ చేశారు.

సో త్రివిక్రం లాంటి ప్రతిభ గల దర్శకుడు కూడా ఇలాంటి గొప్ప ప్రయత్నాలు చేసి మెప్పించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అల్లు అర్జున్ అంటే ఎలాంటి కథ అయినా చేయగలడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి త్రివిక్రం అల్లు అర్జున్ కాంబో ఈసారి నెవర్ బిఫోర్ అనేలా సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకు సంబంధించిన మిగతా డీటైల్స్ అన్ని బయటకు రావాల్సి ఉంది. అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 తర్వాత గురూజీ సినిమానే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.