Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తో టిల్లు బోయ్.. ట్విస్ట్ ఏంటంటే..?

మాటల మాంత్రికుడు త్రివిక్రం అసలు కెరీర్ మొదలు పెట్టింది రైటర్ గానే అని మనకు తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 May 2024 7:37 AM GMT
త్రివిక్రమ్ తో టిల్లు బోయ్.. ట్విస్ట్ ఏంటంటే..?
X

డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టి అదే సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తో 100 కోట్ల హీరోగా తన సత్తా చాటిన సిద్ధు జొన్నలగడ్డ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ విషయంలో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుసు కదా, జాక్ సినిమాలు చేస్తున్న సిద్ధు త్రివిక్రం తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని టాక్. ఐతే త్రివిక్రం డైరెక్షన్ లో కాదు కానీ త్రివిక్రం కథ మాటలు అందించే సినిమాలో సిద్ధు హీరోగా నటిస్తాడని అంటున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రం అసలు కెరీర్ మొదలు పెట్టింది రైటర్ గానే అని మనకు తెలిసిందే. డైరెక్షన్ చేస్తూనే రైటర్ గా కూడా తన సపోర్ట్ అందిస్తుంటారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలకు త్రివిక్రం రైటింగ్ సపోర్ట్ అందిస్తారు. అయితే ఇప్పుడు సిద్ధు కోసం త్రివిక్రం కథ ఇస్తున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రం కథ, మాటలు అందించగా సార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ చేస్తారని టాక్. ప్రస్తుతం వెంకీ అట్లూరి లక్కీ లక్ష్మణ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సిద్ధుతోనే సినిమా ఉంటుందని తెలుస్తుంది.

కెరీర్ లో తను అనుకున్న సక్సెస్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ రాబోయే సినిమాలతో కూడా తన మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో టిల్లు క్యూబ్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే టిల్లు క్యూబ్ డైరెక్టర్ ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు. టిల్లు క్యూబ్ లో బుట్ట బొమ్మ పూజా హెగ్దేని హీరోయిన్ గా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

సిద్ధు జొన్నలగడ్డ జాక్, తెలుసు కదా సినిమాల తర్వాత త్రివిక్రం కథతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. త్రివిక్రం కథ మాటలు అంటే ఆ సినిమా సక్సెస్ రేటు ఎక్కువ ఉన్నట్టే లెక్క. తప్పకుండా సిద్ధు కెరీర్ కి రాబోతున్న సినిమాలు కూడా సపోర్ట్ చేస్తాయని చెప్పొచ్చు. మరి త్రివిక్రం సిద్ధు కాంబో సినిమా గురించి మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. యువ హీరోల్లో స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ దూకుడు మీద ఉన్నాడు. మరి సిద్ధు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి.