Begin typing your search above and press return to search.

మహేష్ లైన్ లో మళ్లీ గురూజీ..?

ఐతే రాజమౌళితో సినిమా తర్వాత మళ్లీ మహేష్ గురూజీతోనే సినిమా చేసే ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 11:30 PM GMT
మహేష్ లైన్ లో మళ్లీ గురూజీ..?
X

సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. SSMB 29వ సినిమాతో పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ రిలీజ్ తో ఇంటర్నేషనల్ రీచ్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు రాజమౌళి గురించి వరల్డ్ సినీ లవర్స్ అంతా మాట్లాడుకునేలా చేయగా మహేష్ సినిమాతో ఇంకాస్త ఇంపాక్ట్ కలిగించేలా చూస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లానింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తుంది.

రాజమౌళి సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మహేష్ ఈ సినిమా పూర్తి చేశాక నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్న డిస్కషన్స్ మొదలయ్యాయి. రాజమౌళి తో సినిమా చేశాక ఆ హీరోల క్రేజ్ ఏంటన్నది తెలిసిందే. కచ్చితంగా మహేష్ పై జక్కన్న సినిమా ఇంపాక్ట్ ఉంటుంది. ఐతే రాజమౌళితో సినిమా తర్వాత మళ్లీ మహేష్ గురూజీతోనే సినిమా చేసే ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది.

అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలం దాకా గ్యాప్ తీసుకున్న త్రివిక్రం మహేష్ గుంటూరు కారంతో కలిసి పనిచేశారు. సినిమా గురించి ఎవరేం అనుకున్నా మహేష్ ఫ్యాన్స్ కి మాత్రం పైసా వసూల్ సినిమా అనిపించింది. అందుకే గురూజీతోనే మహేష్ మళ్లీ కలిసి పనిచేయాలని అనుకుంటున్నాడట. త్రివిక్రం కూడా అసలైతే తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది కానీ ఆ సినిమా డౌటే అని చెప్పుకుంటున్నారు.

పవన్ తర్వాత త్రివిక్రం స్వతహాగా సినిమా చేయాలనుకునే స్టార్ మహేష్ బాబే. పవన్ కళ్యాణ్ ఇప్పుడెలాగు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీల బాధ్యత తీసుకున్నాడు కాబట్టి పవన్ తో చేయాలనుకున్న కథలు ఏమైనా ఉంటే అవి కూడా గురూజీ మహేష్ తో చేసే ఛాన్స్ ఉంటుంది. సో త్రివిక్రం మహేష్ మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా సినిమాలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో చూపించడానికి గురూజీ సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది. హ్యాట్రిక్ సినిమాల తర్వాత మహేష్ తో త్రివిక్రం ఎలాంటి కథతో వస్తాడు. అది కూడా రాజమౌళి సినిమా తర్వాత ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునేందుకు ఇంకా చాలా టైం ఉంది.