Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్.. మల్టీస్టారర్ ప్లానా?

అసలైతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మరొక సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఆ మధ్య క్లారిటీ అయితే వచ్చింది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 11:53 AM GMT
త్రివిక్రమ్.. మల్టీస్టారర్ ప్లానా?
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలైతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మరొక సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ఆ మధ్య క్లారిటీ అయితే వచ్చింది. కానీ బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఆ ప్రాజెక్టుకు ఆగస్టులో రాబోతున్న విషయం తెలిసిందే.

ఇక త్రివిక్రమ్ బన్నీతో చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను కూడా దాదాపు ఫినిష్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోసారి హీరోతో కూర్చుని పూర్తిస్థాయిలో మరో ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ ఆగస్టు వరకు బిజీ కానున్నాడు ఇక త్రివిక్రమ్ గుంటూరు కారం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇప్పుడు గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ బన్నీ కోసం 8 నెలలు ఎదురుచూస్తాడా లేదంటే ఈ గ్యాప్ లో ఏదైనా మరొక ప్రాజెక్టును తొందరగా ఫినిష్ చేస్తాడు అని సందేహాలు వస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ప్రముఖ హీరోలతో త్రివిక్రమ్ ఒక మల్టీ స్టార్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. అది కూడా కామెడీ కంప్లీట్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట.

మొన్నటి వరకు త్రివిక్రమ్ నాని కాంబో అంటూ రూమర్స్ సౌండ్ కాస్త ఎక్కువగానే వినిపించింది కానీ అందులో ఎలాంటి నిజం లేదని కూడా సన్నిహిత వర్గాల ద్వారా క్లారిటీ వచ్చేసింది. అయితే వెంకటేష్ తో కూడా ఒక సినిమా అయితే చేయాల్సి ఉంది. పదేళ్ళ నుంచి ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలు ఎక్కడం లేదు. ఇక ఆయనతోపాటు మరొక హీరో రామ్ తో కూడా సినిమా చేస్తారు అని స్రవంతి రవి కిషోర్ కు ఎప్పుడో మాట ఇచ్చారు.

బహుశా ఇద్దరితో మల్టీస్టారర్ ప్రాజెక్టు రావచ్చు అని టాక్ వినిపిస్తుంది. గతంలో రామ్ వెంకీ మసాలా అనే సినిమా చేశారు. ఇక రీసెంట్ గా వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టారర్ సినిమా ఉంటుంది అని చెప్పడం కూడా ఈ కాంబోపై ఊహగానాలకు తెరలేపింది. ఏదేమైనా వెంకటేష్ తో మాత్రం త్రివిక్రమ్ మల్టీస్టారర్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.