Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ కు ఇదేమి రిస్క్ కాదు.. కానీ..

అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ తర్వాత అల్లు అర్జున్ ఎక్కువగా సినిమాలు చేసింది మాత్రం త్రివిక్రమ్ తోనే.

By:  Tupaki Desk   |   20 Jan 2024 6:04 AM GMT
త్రివిక్రమ్ కు ఇదేమి రిస్క్ కాదు.. కానీ..
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా వస్తుంది అంటే అందులో ప్రాసలు పంచులు అలాగే మంచి ఎమోషన్ ఉంటుంది అని ప్రేక్షకులు అంచనాలు ఎంతో పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల మాత్రం ఆయన సినిమాలలో మునుపటి త్రివిక్రమ్ కనిపించడం లేదు అనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అజ్ఞాతవాసి గాయం ఫ్యాన్స్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది.

ఇక లేటెస్ట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ తన మార్కు కోల్పోయాడు అని కామెంట్స్ కూడా చాలా గట్టిగానే వస్తూ ఉన్నాయి. ఇక దీన్ని ఆయన ఎలా ఓవర్ కమ్ చేస్తారు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎలాగూ అనుబంధ సంస్థ హారిక హాసిని సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగానే ఉంటుంది కానీ అసలు త్రివిక్రమ్ తో ఇప్పుడు స్టార్ హీరోలు కథ చెప్పగానే ఒప్పుకుంటారా లేదా అనేది కూడా మరొక ఊహించని విషయం.

గుంటూరు కారం కంటే ముందే బన్నీతో ఒక సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ తర్వాత అల్లు అర్జున్ ఎక్కువగా సినిమాలు చేసింది మాత్రం త్రివిక్రమ్ తోనే. జులాయి సన్నాఫ్ సత్యమూర్తి అల.. వైకుంఠపురములో మూడు కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అల్లు అర్జున్ మార్కెట్ పెరగడంలో త్రివిక్రమ్ పాత్ర చాలానే ఉంది..

అయితే ఇప్పుడు గుంటూరు సినిమా ఫలితం మళ్లీ బన్నీ ఆలోచనను ఏమైనా మారుస్తుందా లేదా అనే టాక్ కూడా గట్టిగానే వస్తుంది. అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా రేంజ్ లో వెలిగిపోతూ ఉన్నాడు. ఇక ఆ ప్రాజెక్టు సెకండ్ పార్ట్ కూడా అంతకుమించి అనేలా ఉండబోతోంది. మరోవైపు అట్లీ తో కూడా ఒక ప్రాజెక్టు అనుకుంటున్నాడు. అలాగే సందీప్ రెడ్డి కూడా లైన్ లో ఉన్నాడు. త్రివిక్రమ్ బన్నీతో అట్లీ తర్వాత చేయాలి అనుకున్నా కనీసం రెండేళ్లు ఆగాలి.

అయితే అజ్ఞాతవాసి దెబ్బ పడిన తర్వాత ఎన్టీఆర్ తో చాలా తొందరగానే అవకాశం అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు గుంటూరుకారం దెబ్బ తర్వాత మళ్లీ స్టార్ హీరోలతోనే సినిమా చేస్తేనే ఆయన రేంజ్ నిలబడుతుంది అనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ నిజానికి త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సక్సెస్ లు చూసిన తర్వాత వెంటనే టైర్ 2 రేంజ్ లో ఉన్న నితిన్ అఆ సినిమా చేశాడు.

అక్కడ ఆయన తన రేంజ్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు రామ్ పోతినేని వెంకటేష్ లతో కలిసి ఒక మల్టీ స్టార్ చేసే అవకాశంలో ఉన్నట్లు కూడా టాప్ కనిపిస్తోంది. అది కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచి ఫ్యామిలీ కామిడీ జానర్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ పర్ఫెక్ట్ గా ఆ మల్టీ స్టారర్ ను తీరపైకి తీసుకు రాగలిగితే అది 100 కోట్లకు ఏమాత్రం తక్కువ బిజినెస్ అవ్వదు అని చెప్పవచ్చు.

అంతే కాకుండా త్రివిక్రమ్ ఎప్పటి నుంచో వీరితో చేయాల్సిన కమిట్మెంట్ అయితే ఉంది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తున్నాడు అనుకోవచ్చు. ఇక ఇప్పుడు స్టార్ హీరోలలు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు దొరక్కపోయినా త్రివిక్రమ్ ఒక మీడియం రేంజ్ హీరోతో సక్సెస్ కొట్టి ఫామ్ లోకి వస్తే సరిపోతుంది. కానీ అది కూడా తేడా కొడితే మాత్రం మళ్లీ కెరియర్ రిస్క్ లో పడుతుంది. మరి త్రివిక్రమ్ ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి.