Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. త్రివిక్రమ్ ఓవర్సీస్ మ్యాజిక్

దానికి కారణం కుటుంబ బంధాల గురించి, అలాగే మహిళల గురించి త్రివిక్రమ్ తన సినిమాలలో చాలా గొప్పగా చెబుతాడు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 9:29 AM GMT
బాక్సాఫీస్.. త్రివిక్రమ్ ఓవర్సీస్ మ్యాజిక్
X

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకి ఎప్పుడూ కూడా ఒక ప్రత్యకమైన ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా యూత్ కంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. దానికి కారణం కుటుంబ బంధాల గురించి, అలాగే మహిళల గురించి త్రివిక్రమ్ తన సినిమాలలో చాలా గొప్పగా చెబుతాడు. హీరో పాత్ర తర్వాత అతని సినిమాలలో బలమైన రోల్ ఉందంటే కచ్చితంగా అది తల్లి, అత్త, హీరోయిన్ ఏదో పాత్ర అయ్యి ఉంటుంది.

వారి పాత్రల చుట్టూనే కథని నడిపిస్తూ ఉంటాడు. అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్రని చాలా బలంగా చూపించారు. రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలో హీరో మహేష్ బాబు తల్లి క్యారెక్టర్ ని స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు. ఈ కారణంగా త్రివిక్రమ్ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంటుంది. అలాగే అంతర్లీనంగా ఒక సందేశం కూడా అతని కథల్లో ఉంటుంది. ఈ కారణంగానే అతని సినిమాలని ఎక్కువ మంది ఇష్టపడతారు.

ఓవర్సీస్ లో కూడా త్రివిక్రమ్ సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది. ఆయన నుంచి మూవీ వస్తుందంటే భారీ స్థాయిలో బుకింగ్స్ ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చూడటానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తారు. గుంటూరు కారం సినిమాకి డివైడ్ టాక్ వచ్చిన కూడా వంద కోట్లకి పైగా గ్రాస్ ని వసూళ్లు చేసింది. దీనికి కారణం మహేష్ బాబు ఒకటైతే, త్రివిక్రమ్ బ్రాండ్ కూడా మరొకటని చెప్పొచ్చు.

త్రివిక్రమ్ సినిమాలలో నార్త్ అమెరికాలో హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు చేసిన సినిమాలలో మొదటి స్థానంలో ఆల వైకుంఠపురంలో ఉంది. ఈ మూవీ 3.63 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. గుంటూరు కారం మూవీ 2.63 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. నితిన్ హీరోగా తెరకెక్కిన అఆ మూవీ 2.45 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసింది. టాప్ లో అరవింద సమేత వీర రాఘవ ఉంది. ఈ సినిమా 2.18 డాలర్లు కలెక్ట్ చేసింది.

అజ్ఞాతవాసి మూవీ డిజాస్టర్ అయిన కూడా 2.06 మిలియన్ డాలర్స్ నార్త్ అమెరికాలో వసూళ్లు చేసింది. త్రివిక్రమ్ నుంచి చివరిగా వచ్చిన ఐదు సినిమాలు కూడా నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు చేయడం ద్వారా అరుదైన రికార్డ్ సొంతం అయ్యింది.