Begin typing your search above and press return to search.

టిల్లు కోసం కలం పట్టిన త్రివిక్రమ్‌...!

ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సిద్దు తదుపరి సినిమాలపై విపరీతమైన హైప్ క్రియేట్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   27 May 2024 5:19 AM GMT
టిల్లు కోసం కలం పట్టిన త్రివిక్రమ్‌...!
X

డీజే టిల్లు సినిమా తర్వాత ఒక్కసారిగా యంగ్‌ స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సిద్దు తదుపరి సినిమాలపై విపరీతమైన హైప్ క్రియేట్‌ అయ్యింది.

ఇప్పటికే జాక్ సినిమాతో పాటు మరో సినిమాను కూడా చేస్తున్న సిద్దు జొన్నలగడ్డ టిల్లూ క్యూబ్‌ ను ప్రకటించాడు. ఈ మూడు సినిమాలు లైన్‌ లో ఉండగానే కొత్తగా సిద్దు జొన్నలగడ్డ మరో సినిమాకు సైన్ చేశాడు. ఆ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ రచన సహకారం అందించడం విశేషం.

త్రివిక్రమ్‌ రాస్తున్న కథ తో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుందట. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపొందబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైనర్‌ తో కలిసి త్రివిక్రమ్‌ భార్య నిర్మించబోతున్నారు. రచన మరియు నిర్మాణం త్రివిక్రమ్‌ అవ్వడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌ తో లక్కీ బాస్కర్ సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఆ వెంటనే త్రివిక్రమ్‌ తో కలిసి సిద్దు జొన్నలగడ్డ హీరోగా సినిమాను రూపొందించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో సిద్దు భారీగా పారితోషికం పెంచాడనే వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్‌ వంటి స్టార్‌ దర్శకుడితో కలిసి వర్క్ చేయడం వల్ల సిద్దు స్థాయి మరింతగా పెరగడం ఖాయం, తద్వారా ఆయన పారితోషికం మరింతగా పెరగడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా షూటింగ్‌ ను ఇదే ఏడాది ప్రారంభించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.