వెంకీ అట్లూరికి త్రివిక్రమ్ స్టాంప్ మళ్లీ పడిందా!
యంగ్ మేకర్ వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుంది. 'తొలిప్రేమ'తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ తొలి సినిమాతోనే తన ప్రత్యేకతని చాటాడు
By: Tupaki Desk | 26 Sep 2023 12:30 AM GMTయంగ్ మేకర్ వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుంది. 'తొలిప్రేమ'తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ తొలి సినిమాతోనే తన ప్రత్యేకతని చాటాడు. అటుపై తెరకెక్కించిన 'మిస్టర్ మజ్ను'..'రంగ్ దే' లాంటి సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వనప్పటికీ ఆ పరాజయాలు తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. అటుపై 'సార్' సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే గురూజీ త్రివిక్రమ్ ఓ సక్సెస్ స్టాంప్ కూడా వేసేసారు.
స్టోరీ విన్న వెంటనే వాస్తవ జీవితాలకు దగ్గరగా ఉండే కథని..స్టోరీలో కొన్ని అంశాలు గురూజీని వ్యక్తిగతంగానూ కనెక్ట్ చేసాయి. 'సార్' స్టోరీ రాసుకున్న విధానం..మేకింగ్ ప్రతీది ఆకట్టుకుంది. అందుకే రిలీజ్ కి ముందే సినిమా విజయం సాధిస్తుందని స్టాంప్ వేయగలిగారు. అలాగే వెంకీ రైటింగ్ శైలి గురించి మాట్లాడారు. అలా తొలిసారి వెంకీ - త్రివిక్రమ్ ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ కొనసాగుతుంది.
తాజాగా వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ హీరోగా 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ సాధరణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరుకున్న అసాధారణ ప్రయామణే ఈ సినిమా. అంటే సినిమా ఎలా ఉండబోతుందో ఓ అంచనాకి వచ్చేయచ్చు. ఈ పాయింట్ కాస్త సార్ చిత్రానికి రిలేటెడ్ గా ఉన్నా! ఇది పూర్తి భిన్నమైన స్టోరీ. ఇలాంటి లైన్లతో సినిమాలు కొత్తేం కాదు. కానీ ఏ కథని హైలైట్ చేయాలన్నా అది కేవలం మేకింగ్ ఎగ్జిక్యూషన్ పైనే ఆధారపడి ఉంటుంది.
ఆ విషయంలో వెంకీ చూసుకునే పనిలేదు. తాజాగా ఈ సినిమా స్టోరీ విషయంలోనూ గురూజీ మరోసారి స్టాంప్ వేసినట్లు వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఎంట్రీ వెనుక త్రివిక్రమ్ ఉన్నారని వినిపిస్తున్నదే. ఇంతలో స్టోరీ విషయంలో కూడా స్టార్ డైరెక్టర్ ఉన్నారు అన్నది ఆసక్తికరం. మొత్తానికి రిలీజ్ కి ముందే గురూజీ స్టాంప్ సినిమాకి మరోసారి కలిసొచ్చే అంశమే. ఈ సినిమా నిన్నటి రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.