'ఖైదీ' సీక్వెల్ బాధ్యతలు త్రివిక్రమ్ కా?
తన పాత చిత్రాల్లో సీక్వెల్ చేయాలనిపిస్తే మీ తొలి ఛాయిస్ ఏది అంటే? మెగాస్టార్ నుంచి వచ్చే మొట్ట మొట్ట మొదటి చిత్రం 'ఖైదీ'
By: Tupaki Desk | 30 Sep 2023 11:30 PM GMT'ఖైదీ' సీక్వెల్ షురూ కాబోతుందా? ఆ బాధ్యతలు త్రివిక్రమ్ తీసుకున్నారా? మెగాస్టార్ 160వ చిత్రం 'ఖైదీ' సీక్వెల్ కానుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 'ఖైదీ' ఓ మైలురాయి అని చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి నటించిన గొప్ప చిత్రాల్లో అదొకట. చిరంజీవి మెచ్చిన చిత్రం కూడా అదే. ' ఖైదీ' లాంటి యాక్షన్ సినిమా చేయాలని మెగాస్టార్ మనసులోనూ ఎప్పటి నుంచో ఉన్న కోరిక.
తన పాత చిత్రాల్లో సీక్వెల్ చేయాలనిపిస్తే మీ తొలి ఛాయిస్ ఏది అంటే? మెగాస్టార్ నుంచి వచ్చే మొట్ట మొట్ట మొదటి చిత్రం 'ఖైదీ'. 150కి పైగా చిత్రాల్లో నటించినా సీక్వెల్ అనే ప్రస్తావన తెస్తే మాత్రం మెగాస్టార్ 'ఖైదీ' గురించే మాట్లాడుతారు. ఇక ఆసినిమా సక్సెస్ గురించి..అందులో మెగాస్టార్ యాక్షన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అప్పట్లో ఓ సంచలనం.
25 లక్షల బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా 8 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడీ 'ఖైదీ' సినిమా సీక్వెల్ కథని గురూజీ త్రివిక్రమ్ సిద్దం చేస్తున్నారని మెగా కాపౌండ్ వర్గాల నుంచి లీకైంది. ఖైదీ సీక్వెల్ స్టోరీ సిద్దం చేయమని స్వయంగా చిరంజీవి ..గురూజీని కోరారుట. ఇప్పుడున్న దర్శకుల్లో ఖైదీ లాంటి గొప్ప స్టోరీ సిద్దం చేయగల సమర్దుడు త్రివిక్రమ్ మాత్రమేనని నమ్మి ఆ అవకాశం ఆయనకు కల్పించినట్లు వినిపిస్తుంది.
సినిమా స్టోరీ ఇలా ఉంటే బాగుంటుందని రఫ్ గా చిరంజీవి ఓ ఐడియా కూడా పాస్ చేసారుట. నెటి జనరే షన్ కి తగ్గట్టు ఆ సీక్వెల్ కథ ఎలా ఉంటే బాగుంటుంది అన్న దానిపై చిరు-త్రివిక్రమ్ మధ్య రీసెంట్ గా సీరియస్ గా డిస్కషన్ నడించిందిట. అందుకు చిరంజీవి కావాల్సినంత సమయం కూడా ఇచ్చారుట. ఇప్పుడే కథని సిద్దం చేసేయాలని తొందరలేదని..తన ఖాళీ సమయం చూసుకుని వీలైనప్పుడు స్టోరీ సిద్దం చేయమని చెప్పారుట. సరైన సమయం చూసుకుని ఆప్రాజెక్ట్ ప్రకటిద్దామని సూచించినట్లు సమాచారం.
అందుకు త్రివిక్రమ్ కూడా ఎస్ చెప్పినట్లు సమాచారం. ఇద్దరి జర్నీ ఇప్పుడే మొదలైంది కాబట్టి 'ఖైదీ' సీక్వెల్ కి సమయం పడుతుంది. ప్రస్తుతం చిరంజీవి 156..157 సినిమాలు పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత 158..159 చిత్రాలు కూడా పూర్తి చేయాలి. ఖైదీ సీక్వెల్ అంటే అది ల్యాండ్ మార్క్ నెంబర్ అయి ఉండాలి. ఈ నేథ్యంలో ఆసినిమా 160వ చిత్రం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీనే నిర్మించే అవకాశం ఉంది.