Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్.. మళ్లీ టార్గెట్ అవుతారా?

ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గుంటూరు కారం

By:  Tupaki Desk   |   5 Feb 2024 12:33 PM GMT
త్రివిక్రమ్.. మళ్లీ టార్గెట్ అవుతారా?
X

ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గుంటూరు కారం. మొదటి షో నుంచే మిక్స్ డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజైన తర్వాత నెట్టింట త్రివిక్రమ్ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. త్రివిక్రమ్ స్థాయికి తగ్గ సినిమా కాదని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు నెటిజన్లు.

గుంటూరు స్టోరీపై త్రివిక్రమ్ కరెక్ట్ గా కసరత్తు చేయలేదని హీరో మహేశ్ ఫ్యాన్స్ నెట్టింట ఫుల్ కామెంట్లు చేశారు. కొన్నిరోజుల పాటు ఒక ఆట ఆడుకున్నారు. మహేశ్ బాబు బాగా కష్టపడ్డారని, త్రివిక్రమ్ స్టోరీ టెల్లింగ్ లోనే ఫెయిల్ అయ్యారంటూ నిందించారు. సినిమాలోని అనేక అంశాలను పాయింట్ అవుట్ చేసి మరీ ట్రోలింగ్ చేశారు.

అయితే ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి త్రివిక్రమ్ ఎక్కడా కనిపించడం లేదు. ఇంటర్వ్యూల దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు.. ప్రెస్ మీట్ దగ్గర నుంచి సక్సెస్ పార్టీ వరకు.. ఎందులోనూ ఆయన పార్టిసిపేట్ చేయలేదు. తనపై వచ్చిన ట్రోల్స్ కు త్రివిక్రమ్ చాలా బాధపడ్డారట. అందుకే మూవీ రిలీజ్ తర్వాత అమెరికా వెళ్లిపోయారట.

ఇదంతా పక్కన పెడితే.. గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. థియేటర్లలో రిలీజ్ అయిన నెలల రోజుల్లోపే అంటే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే థియేటర్లలో చూసిన వారు కూడా మరోసారి ఈ మూవీని ఓటీటీలో చూస్తారు. దీంతో త్రివిక్రమ్ ను నెట్టింట మళ్లీ టార్గెట్ చేస్తారనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఈసారైనా త్రివిక్రమ్ తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తారేమో చూడాలి.

కథేంటంటే?

ఓ పార్టీ నాయకుడు వెంకట సూర్య నారాయణ (ప్రకాశ్‌ రాజ్‌) కుమార్తె వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. ఆమెను మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాటా మధు (రవిశంకర్‌) తనకే మంత్రి పదవి కావాలంటాడు. అందుకు ఒప్పుకోకపోతే వసుంధరకు మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని, రెండో పెళ్లి విషయాన్ని బయటపెడతానని బెదిరిస్తాడు.

దీంతో ముందు జాగ్రత్తగా సూర్యనారాయణ.. వసుంధర మొదటి భర్త కొడుకు రమణ (మహేశ్‌)ను పిలిచి.. తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని బాండ్‌ పై సంతకం చేయాలంటాడు. దానికి రమణ ఒప్పుకోడు. అసలు వసుంధర మొదటి భర్తకు ఎందుకు విడాకులిచ్చింది? రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? చివరకు రమణ తన తల్లి ప్రేమ పొందాడా? లేదా? అన్నదే మిగతా సినిమా.