Begin typing your search above and press return to search.

గురూజీ ప్లాన్ మిస్సైంది గురూ!

కానీ తాజా స‌న్నివేశం చూస్తుంటే గురూజీ ఉచ్చు నుంచి బ‌న్నీ ఎస్కేప్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి అట్లీ రావ‌డంతో సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది.

By:  Tupaki Desk   |   31 March 2024 11:30 PM GMT
గురూజీ ప్లాన్ మిస్సైంది గురూ!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. 'పుష్ప‌-2' త‌ర్వాత గురూజీతో ఓ సినిమా చేసేలా ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఇప్పుడా స‌మీక‌ర‌ణాలు కూడా మారుతోన్న వైనం క‌నిపిస్తూనే ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి అట్లీ రావ‌డంతో! గురూజీతో సినిమా ఉంటుందా? ఉండ‌దా? అన్న ఓడైల‌మా మొద‌లైంది. దాదాపు అట్లీతో బ‌న్నీ ప్రాజెక్ట్ క‌న్ప‌మ్ అయింద‌నే వార్త‌లు బ‌లంగానే వినిపిస్తున్నాయి. 'పుష్ప‌-2' త‌ర్వాత మొద‌ల‌య్యే చిత్రం ఇదేనని అంటున్నారు.

ఇదే జ‌రిగితే గురూజీ కొన్నాళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే. లేదంటే టైర్ -2 హీరోల‌కు దిగాల్సిందే. అంత‌కు మించి త్రివిక్ర‌మ్ కి మ‌రో ఆప్ష‌న్ లేదు. ప్ర‌స్తుతం స్టార్ హీరోలంతా ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌బెడితే రామ్ చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్..ప్ర‌భాస్.. మ‌హేష్ షెడ్యూల్స్ ఇప్ప‌టికే ఫిక్స్ అయిపోయాయి. వీరంతా మ‌రో రెండేళ్ల పాటు ఏ డైరెక్ట‌ర్ కి డేట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఈ విష‌యాల‌న్ని గురూజీ తెలివిగా ముందే గెస్ చేసి బ‌న్నీని లాక్ చేయాల‌ని ట్రై చేసాడు.

అందుకే 'పుష్ప‌-2' సెట్స్ లో ఉండ‌గానే మ‌రో డైరెక్ట‌ర్ కి డేట్లు ఇవ్వ‌కుండా ముందే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయించుకున్నాడు. ఆ రకంగా గురూజీ ఉచ్చులో బ‌న్నీ చిక్కుకున్నాడు. 'పుష్ప‌-2' త‌ర్వాత బ‌న్నీ పాన్ ఇండియా రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ఆ ద‌శ‌లో మ‌ళ్లీ పాన్ ఇండియా సినిమా చేస్తాడు? త‌ప్ప లోక‌ల్ సినిమా చేయ‌డానికి ఛాన్సెస్ తక్కువ‌గా ఉంటాయి. ఇవ‌న్నీ ఆలోచించే త్రివిక్ర‌మ్ బ‌న్నీ త‌న వైపు ఉండేలా ఓప్లాన్ వేసాడు.

కానీ తాజా స‌న్నివేశం చూస్తుంటే గురూజీ ఉచ్చు నుంచి బ‌న్నీ ఎస్కేప్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి అట్లీ రావ‌డంతో సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది. అట్లీ లాంటి పాన్ ఇండియా మేక‌ర్ ని ముందు పెట్టుకుని గురూజీతో సినిమా అంటే? బ‌న్నీ మూవ్ అవ్వ‌డం క‌ష్ట‌మే. ఇప్పుడు జ‌రుగుతోన్న ప్ర‌చారం కూడా ఆ స‌న్నివేశ‌మే ఊత‌మిస్తుంది. ఇదే జ‌రిగితే త్రివిక్ర‌మ్ టైర్ -2..టైర్ -3 హీరోల్ని సెట్ చేసుకోవాల్సిందే. లేదంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ అవ‌కాశ‌మివ్వాలి.