Begin typing your search above and press return to search.

గురూజీ మీ ఫ్యాన్స్ వెయిటింగ్..!

కమర్షియల్ సినిమా లెక్కలకు తగినట్టుగానే హీరో మార్కెట్ ని అంచనా వేస్తూ ఆయన సినిమాలు చేస్తారు

By:  Tupaki Desk   |   1 July 2024 12:30 AM GMT
గురూజీ మీ ఫ్యాన్స్ వెయిటింగ్..!
X

తెలుగులో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరు త్రివిక్రం శ్రీనివాస్. మొదట రైటర్ గా పరిచయమై ఆ తర్వాత డైరెక్టర్ గా తన మార్క్ సెట్ చేసుకున్నారు. త్రివిక్రం సినిమాల్లో కథల కన్నా కథనం హృదయానికి హత్తుకుంటుంది. ఇక ఆయన సినిమాల్లో డైలాగ్స్ అయితే డైరెక్ట్ గా గుండెకు తగులుతాయి. ఏ ఉద్దేశంతో త్రివిక్రం పెన్ను పట్టి మాటలు రాస్తాడో ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతుంటాడు. ఐతే రైటింగ్ ఒక్కటి బాగుంటే సరిపోతుందా సినిమాలు ఆడేస్తాయా సినిమాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే అంతకుమించిన కథ ఉండాలి. త్రివిక్రం సినిమాలు ఇప్పటివరకు చూస్తే రెగ్యులర్ రొటీన్ గానే వచ్చాయి.

కమర్షియల్ సినిమా లెక్కలకు తగినట్టుగానే హీరో మార్కెట్ ని అంచనా వేస్తూ ఆయన సినిమాలు చేస్తారు. ఐతే త్రివిక్రం కి ఉన్న ప్రతిభ నాలెడ్జ్ గురించి అందరికీ తెలిసిందే. అంతేకాదు పురాణాల మీద ఆయనకున్న పట్టు మరెవరికి ఉండదు కావొచ్చు. ఐతే మిగతా దర్శకులు రామాయణ, మహాభారతాలను చేస్తుంటే త్రివిక్రం ఎందుకు అలాంటి ప్రాజెక్ట్ చేయలేకపోతున్నాడని అందరు డౌట్ పడుతున్నారు.

ఎన్నాళ్లని మదర్, ఫాదర్ సెంటిమెంట్ సినిమాలు చూస్తారు. అఫ్కోర్స్ ఇలాంటివి చాలా వచ్చాయి ఇక మీదట ఎవరో ఒకరు తీస్తారు. కానీ త్రివిక్రం కూడా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారంగా ఒక మైథలాజికల్ మూవీ తీస్తే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నారు త్రివిక్రం. ఆయనకున్న కన్విక్షన్ కి కథ సిద్ధం చేస్తే చాలు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా డేట్స్ ఇచ్చేస్తాడు. ఐతే అంత గ్రాండియర్ సినిమా తీయాలంటే త్రివిక్రం కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

రైటింగ్ మీద ఉన్న గ్రిప్ సినిమా మేకింగ్ మీద కూడా ఉన్నా ఇంకా ఆ టెక్నికల్ సీక్రెట్స్ తెలుసుకుని గురూజీ రామాయణంలోని ఏదో ఒక కథను.. లేదా మహా భారతం లోని ఒక అంశాన్ని తీసుకుని సినిమా చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ ఆ రూట్ లో సినిమాలు చేసి వారెవా అనిపించేస్తున్నారు. మరి త్రివిక్రం కూడా ఆలాంటి ఒక ప్రాజెక్ట్ చేస్తే మాత్రం అనౌన్స్ మెంట్ రోజే ఆడియన్స్ అంతా ఖుషి అవుతారని చెప్పొచ్చు. త్రివిక్రం ఎలాగు ఈమధ్య తన సినిమాలను రెండు మూడేళ్లు తీస్తున్నాడు అదేదో ఒక భారీ సినిమా చేస్తే కొన్నాళ్ల వరకు ఆ సినిమా సృష్టించిన రికార్డుల గురించి చెప్పుకునే ఛాన్స్ ఆయన అభిమానులకు ఉంటుంది.