Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్.. ఆ హీరోతో చేయాల్సిందే..

ఇప్పటికే అల్లు అర్జున్ తో ఒక పాన్ ఇండియా చిత్రం అనౌన్స్ చేసినా, ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు.

By:  Tupaki Desk   |   18 May 2024 12:47 PM GMT
త్రివిక్రమ్.. ఆ హీరోతో చేయాల్సిందే..
X

ఇటీవల కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ వేస్తున్న అడుగులు ఊహించని విధంగా ఉంటున్నాయి. ఆయన పెన్ను పవర్ తగ్గిందా లేదంటే జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ పై గతంలో ఎప్పుడు లేనంత ఆసక్తి రేకెత్తిస్తున్నారు. "గుంటూరు కారం" విడుదల అనంతరం, త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ పై ఇంకా స్పష్టత రాలేదు.

ఇప్పటికే అల్లు అర్జున్ తో ఒక పాన్ ఇండియా చిత్రం అనౌన్స్ చేసినా, ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ బన్నీ కంటే ముందే జెట్ స్పీడ్ లో ఒక ప్రాజెక్ట్ ను త్వరగా మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప 2: ది రూల్" షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత మాత్రమే త్రివిక్రమ్ సినిమా ప్రారంభమవుతుందని అంచనా వేయవచ్చు. ఇంతలో త్రివిక్రమ్ తన సమయాన్ని వృధా కాకుండా, రామ్ తో ఒక చక్కని ఎంటర్‌టైనర్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సీనియర్ నిర్మాత స్రవంతి రవికిశోర్, త్రివిక్రమ్ - రామ్ కాంబినేషన్ ను సెట్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

రవికిశోర్ కెరీర్ మొదట్లో త్రివిక్రమ్ కు మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాత. త్రివిక్రమ్ కూడా ఆయనపై ఎప్పుడు ఆ కృతజ్ఞత చూపిస్తారు. ఆ బాండింగ్ తోనే రవి కిషోర్ తన సోదరుడి కొడుకైన రామ్ తో సినిమా సెట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ తో కలిసి పని చేయడం అనేది త్రివిక్రమ్ కు సవాలు కావచ్చు కానీ, బహుశా ఇది ఆయనకు ఒక మంచి అవకాశం కూడా కావచ్చు. గతంలో నితిన్ తో అఆ సినిమాతో ఎలాంటి హిట్ అందుకున్నారో ఇప్పుడు రామ్ తో కూడా అలానే ట్రై చేస్తే సరిపోతుంది.

త్రివిక్రమ్ రామ్ కోసం కొత్త ప్రాజెక్ట్ పై మంచి కథ సిద్ధం చేశారని సమాచారం. అయితే, ఇప్పుడు పెద్ద స్టార్ లతో పని చేస్తూనే, మళ్ళీ ఒక టైర్ 2 హీరోతో పని చేయడం త్రివిక్రమ్ కి పెద్ద సమస్య కాదు. త్రివిక్రమ్ ఒక మంచి స్క్రిప్ట్ తో రామ్ కు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ మీడియా ముందుకు రాకపోవడంతో, ఈ విషయాలపై క్లారిటీ లేదు. కానీ, రామ్ తో త్రివిక్రమ్ చేసే ఈ కొత్త ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది.

త్రివిక్రమ్ తన కథనంతో మరియు దర్శకత్వంతో ఎప్పుడూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తారు. రామ్ తో కలిసి ఆయన ఒక మంచి ఎంటర్‌టైనర్ రూపొందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరి ఈ కలయికలో వచ్చే సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి.