Begin typing your search above and press return to search.

హై ఓల్టేజ్ స్టార్ ని గురూజీ ట‌చ్ చేస్తున్నాడా?

వీలైనంత వ‌ర‌కూ సేఫ్ జోన్ లో నే సినిమాలు చేసేందుకు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ హైఓల్టేజ్ స్టార్ రామ్ ని ట‌చ్ చేస్తున్న‌ట్లు తాజాగా వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   10 May 2024 12:28 PM GMT
హై ఓల్టేజ్ స్టార్ ని గురూజీ ట‌చ్ చేస్తున్నాడా?
X

హిట్ ఇచ్చినా ద‌ర్శ‌కులంతా ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితి. స్టార్ హీరోలంతా ఇత‌ర చిత్రాల‌తో బిజీగా ఉండ‌టంతో చివ‌రికి త్రివిక్ర‌మ్ కి కూడా హీరో దొర‌క‌ని ప‌రిస్థితి క‌నిపిస్తుంది. బ‌న్నీతో సినిమా చేయాల‌నుకున్నా? ఆయ‌న అట్లీ కి లాక్ అవ్వ‌డంతో ఇప్ప‌ట్లో బ‌న్నీ డేట్లు కూడా క‌ష్ట‌మే. అలాగ‌ని సీనియ‌ర్ హీరోల జోలికి వెళ్ల‌డం లేదు. వీలైనంత వ‌ర‌కూ సేఫ్ జోన్ లో నే సినిమాలు చేసేందుకు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ హైఓల్టేజ్ స్టార్ రామ్ ని ట‌చ్ చేస్తున్న‌ట్లు తాజాగా వినిపిస్తుంది.

రామ్ తో ఓ సినిమా చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు లీకులందుతున్నాయి. అందుకు ఛాన్సెస్ కూడా ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం రామ్ పూరి ద‌ర్శక‌త్వంలో 'ఇస్మార్ట్ శంక‌ర్' లో న‌టిస్తున్నాడు.

ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతానికి ఏ ద‌ర్శ‌కుడి డేట్లు కూడా ఇవ్వ‌లేదు. గౌత‌మ్ మీన‌న్ తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది గానీ అందులో క్లారిటీ లేదు. ఇంత‌లో గురూజీ లైన్ లోకి వ‌చ్చిన‌ట్లు వినిపిస్తుంది.

ఆయ‌న తెర‌పైకి వ‌స్తే గౌత‌మ్ సినిమాని రామ్ హోల్డో లో పెట్టేస్తాడు.ఎందుకంటే కొంత కాలంగా గౌత‌మ్ కూడా స‌క్సెస్ ల్లో లేడు. అత‌ని క‌న్నా గురూజీ అయితేనే సేఫ్ జోన్. రామ్ కూడా స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న స‌మ‌యం. వీలైనంత వ‌ర‌కూ అత‌ను కూడా కంప‌ర్ట్ జోన్ లో సినిమాలు చేయ‌డానికే చూసుకుంటాడు. గురూజీ స్టోరీ ఒకే అయితే గ‌నుక వీళ్లిద్ద‌రు సెట్స్ కి వెళ్ల‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు. రామ్ ఎన‌ర్జీకి త‌గ్గ స్టోరీలు రాయ‌డంలో త్రివిక్ర‌మ్ కి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు.

రెండు నెలల్లో స్టోరీ సిద్దం చేయ‌గ‌ల‌డు. రామ్ బంధువైన స్ర‌వంతి ర‌వికిషోర్ కూడా త్రివిక్ర‌మ్ చాలా కాలంగా స్నేహితుడు. ర‌వి కిషోర్ నే తొలుత త‌న బ్యాన‌ర్లో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చారు. ఆ కృత‌జ్ఞ‌త‌ ఎలాగూ గురూజీకి ఉంటుంది. ఇప్పుడా ఆఫ్యామిలీ హీరోతో సినిమా చేస్తే కొంత వ‌ర‌కూ ఆ కృత‌జ్ఞ‌తా భారం కూడా దించుకున్న‌ట్లు అవుతుంది. అందుకు స‌రైన స‌మ‌యం కూడా ఇదే.