ఇష్టపడి చేసిన పాత్రపై ట్రోలింగ్..ఆ నటి తట్టుకోగలదా?
హిట్ సినిమా 'చంద్రముఖి' కి సీక్వెల్ గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ డంలో ఘోరంగా విఫలమైంది.
By: Tupaki Desk | 31 Oct 2023 7:33 AM GMTసోషల్ మీడియాలో నెటి జనులకు దొరకనంత వరకే. దొరికితే సన్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి..అమితాబచ్చన్ లాంటి లెజెండరీ నటుల సినిమాలే ట్రోలింగ్ కి గురయ్యాయి. రకరకాల మీమ్స్ తో ఆ స్టార్ హీరో చిత్రాలు నెట్టింట అడ్డంగా బుక్కైనవే. తాజాగా 'చంద్రముఖి -2' కూడా దొరికింది. ఇటీవల థియేట్రికల్ రిలీజ్ లో సినిమా ఎలాంటి ఫలితం సాధించిందో తెలిసిందే.
హిట్ సినిమా 'చంద్రముఖి' కి సీక్వెల్ గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ డంలో ఘోరంగా విఫలమైంది. రిలీజ్ కి ముందు బోలెడంత హడావుడి జరిగింది. కానీ తొలి షో తోనే పసలేసి సినిమా అని తేలిపోయింది. తాజాగా ఈసినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ట్రోలర్స్ కి ఆహారంగానూ మారిపోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా ట్రోలర్స్ 'చంద్రముఖి-2' పై ఎటాకింగ్ దిగారు.
కంగనా రనౌత్ -లారెన్స్‌తో సహా ప్రముఖ తారాగణం కలిగి ఉన్న సీన్ క్లింప్పుగ్ లపై తమదైన శైలిలో క్రియేటివిటీ చూపించే పనిలో పడ్డారు ట్రోలర్స్. రకరకాల మీమ్స్ ...కామెంట్లతో ఏ మాత్రం కనికరించడం లేదు. ఇంతవరకూ లారెన్స్..చంద్రముఖి సినిమాలపై ఇలాంటి ట్రోలింగ్ ఎప్పుడూ జరగలేదు. ఎన్ని ప్లాప్ సినిమాలు చేసినా! ఈ రేంజ్ లో ట్రోలర్స్ ఎటాకింగ్ కి దిగింది లేదు. కానీ ఆ ఇద్దరి మధ్య సన్నివేశాల్ని పన్నీగా హైలైట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.
అవన్నీ చూస్తుంటే ఈ ఏడాది అత్యధికంగా ట్రోల్ చేయబడిన చిత్రంగా రికార్డు సృష్టిస్తుంది అన్న సందేహం కలుగుతుంది. మరి ఈ ట్రోలింగ్ పై కంగన...లారెన్స్ స్పందిస్తారా? అన్నది చూడాలి. సాధార ణంగా కంగన ప్రతీ అంశంపై స్పందిస్తుంది. అది పాజిటివ్ అయినా..నెగిటివ్ అయినా తనవైపు నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి చంద్రముఖిలో తన పాత్రపై తెర లేచిన ట్రోలింగ్ పై స్పందిస్తుందా? మౌనంగా ఉంటుందా? అన్నది చూడాలి. ఎంతో ఇష్టపడి చేసిన రోల్ కంగనని ఇంతగా ట్రోల్ చేస్తుందని ఆమె కూడా ఊహించి ఉండదు.