ఆంజనేయుడి సీట్.. తేజ సజ్జాపై ట్రోల్స్ మంట.. ఆగేలా లేదు
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 Nov 2024 7:21 AM GMTరామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించారు. రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమాకు బీటౌన్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓ రేంజ్ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. దారుణంగా నిరాశపరిచింది.
క్యాస్టింగ్ గెటప్స్ అండ్ వీఎఫ్ ఎక్స్ విషయంలో చాలా ట్రోల్స్ ఎదుర్కొంది. కానీ మూవీ టీమ్.. రిలీజ్ కు ముందు మాత్రం భారీగా ప్రమోషన్స్ చేపట్టింది. ఎవరూ ఊహించని రీతిలో ప్రమోట్ చేసింది. తిరుపతిలో వేరే లెవల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. అన్నింటి కన్నా.. సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఒక సీటును ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఆ విషయం చాలా వైరల్ అయింది.
ఇప్పుడు ఆ విషయంపై దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో యంగ్ హీరో తేజ సజ్జా సరదాగా చేసిన వ్యాఖ్యలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. గత నెల జరిగిన ఐఫా అవార్డుల వేడుకకు టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటితో కలిసి తేజ హోస్ట్ గా వ్యవహరించారు. వేదికపై రానాతో కలసి ఓ రేంజ్ లో అల్లరి చేశారు. అందులో భాగంగా రానా.. టాలీవుడ్ హైలెట్స్ అంటూ ఓ పేపర్ ఇచ్చి తేజను చదవమంటారు.
అప్పుడు "ఆదిపురుష్ సినిమాకు ప్రతి థియేటర్ లో ఒక సీట్ ఆంజనేయ స్వామికి వదిలేశారు. ఆంజనేయ స్వామి కూడా ఓటీటీలో చూద్దామని వదిలేశారు" అని తేజ చదువుతారు. ఆ తర్వాత ఇదేదో కాంట్రవర్సీ వ్యవహారం లా ఉంది.. నీయమ్మ నేనెళ్లిపోతా ఇక్కడి నుంచి అంటూ తేజ వెళ్లిపోవడానికి ట్రై చేస్తారు. దీంతో రానా తేజను ఆపి తర్వాతవి కూడా చదివిస్తారు. ఇప్పుడు హనుమంతుడి సీటు కోసం చేసిన తేజ కామెంట్స్ వైరల్ గా మారాయి.
దీంతో అనేక మంది ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. కామెడీ చేయడం తప్పు కాదని.. కానీ హర్ట్ చేసేలా ఉండకూడదని అంటున్నారు. తేజ అలా అనకుండా ఉండాల్సిందని, వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయికే ఇంకొందరు మాత్రం.. సెటైర్ ను అలానే తీసుకోవాలనిస సీరియస్ అవ్వకూడదని చెబుతున్నారు. మరి తేజ సజ్జా స్పందిస్తారేమో వేచి చూడాలి.