భార్యపై అధ్యక్షుడు అత్యాచారం.. ట్రంప్ బయోపిక్ షాక్‌లు!
కేన్స్ లో ప్రదర్శించిన విజువల్స్ లో ట్రంప్ జీవితంలోని అనేక షాకింగ్ మూవ్‌మెంట్స్ ని తెరపై చూపించారని కూడా చెబుతున్నారు.
By: Tupaki Desk | 21 May 2024 8:07 PM GMTడొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద బయోపిక్-'ది అప్రెంటిస్' కేన్స్ -2024 లో ప్రదర్శించగా అది ప్రకంపనాలు రేపింది. ఒక రకంగా ఇది సినిమా పండుగను షేక్ చేసిందంటూ వార్తా కథనాలు వెలువడుతున్నాయి. వ్యాపారవేత్త, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో సెబాస్టియన్ స్టాన్ డొనాల్డ్ ట్రంప్ పాత్రలో నటించారు. ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా ఎలా మార్మోగిందో చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రంలో అతడి వ్యక్తిగత జీవితాన్ని తెరపై చూపించారని సమాచారం. ఈ చిత్రం థియేటర్లలో బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటూ కేన్స్ లో విజువల్స్ వీక్షించిన వారు ప్రశంసించారు. ఇందులో సంథింగ్ ఏదో మ్యాటర్ ఉందని టాక్ వినిపిస్తోంది. కేన్స్ లో ప్రదర్శించిన విజువల్స్ లో ట్రంప్ జీవితంలోని అనేక షాకింగ్ మూవ్‌మెంట్స్ ని తెరపై చూపించారని కూడా చెబుతున్నారు.
తాజా మీడియా కథనాల ప్రకారం... డొనాల్డ్ ట్రంప్ తన మాజీ భార్య ఇవానాపై అత్యాచారం చేసి, తన కలల్ని నిజం చేసుకునేందుకు అండర్ వరల్డ్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాడని కూడా తెరపై చూపించారట. ఈ చిత్రంలో 1970 - 1980 లలో ట్రంప్ జీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. సినిమాని వీక్షించిన సెలబ్రిటీలు చాలా మంది నటీనటుల నటనను ప్రశంసిస్తూ 8 నిమిషాల పాటు చప్పట్లతో హోరెత్తించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ స్టార్ కేట్ బ్లాంచెట్ ఎనిమిది నిమిషాల పాటు నిలబడి చప్పట్లు కొట్టడమే కాదు.. ఇందులో నటించిన టైటిల్ పాత్రధారి సెబాస్టియన్ స్టాన్ ను కౌగిలించుకున్నారు.. డైరెక్టర్ అలీ అబ్బాసిని అభినందించారు.
అయితే ట్రంప్ బయోపిక్ పై అంసతృప్తిగా ఉన్న వారి బృందం ఈ చిత్రంపై దావా వేస్తున్నారని, యుఎస్‌లో విడుదల కాదని కూడా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తప్పుగా చూపిస్తున్నారు. ఈ చెత్త ఒక కల్పన.. ఇది చాలా అబద్ధాలతో సంచలనం రేపే ప్రయత్నం! అని ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చేంగ్ న్యూయార్క్ పోస్ట్‌తో అన్నారు. ఈ ఫిల్మ్ హానికరమైనది.. పరువు నష్టం కలిగిస్తోంది. ఇది విడుదల కాదు. కనీసం డీవీడీ రూపంలో కూడా బయట దొరకదు! అంటూ హెచ్చరించారు.
ప్రీమియర్ తర్వాత కేన్స్ వద్ద చిత్ర దర్శకుడు అబ్బాసి విలేకరులతో మాట్లాడుతూ, ''డోనాల్డ్ ట్రంప్ బృందం మాపై కేసు పెట్టడానికి ముందు సినిమా చూడటానికి వేచి ఉండాలి. ఇది అతడు ఇష్టపడని సినిమా అని నేను అనుకోను… అతడు ఆశ్చర్యపోతాడని నేను భావిస్తున్నాను'' అని అన్నారు. అప్రెంటిస్ సెబాస్టియన్ స్టాన్ మాజీ అధ్యక్షుడి పాత్రలో నటించగా, జెరెమీ స్ట్రాంగ్ తన న్యాయవాది, గురువు రాయ్ కోన్ పాత్రను పోషించారు. ఈ చిత్రం (ది అప్రెంటిస్) రిలీజ్ తేదీపై ఇంకా క్లారిటీ లేదు. యుఎస్ సహా ప్రపంచవ్యాప్త విడుదల తేదీలను ప్రకటించాల్సి ఉంది.