Begin typing your search above and press return to search.

'దేవ‌ర' మ‌రోటి ముస్తాబు చేస్తోందే!

ఇప్ప‌టికే సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   27 July 2024 11:24 AM GMT
దేవ‌ర మ‌రోటి ముస్తాబు చేస్తోందే!
X

ఇక 'దేవ‌ర' నుంచి ప్ర‌తీ అప్ డేట్ ఎంతో ఇంట్రెస్టింగా ఉంటుంది. షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకోవ‌డం..రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న వేళ కాబ‌ట్టి ఇక నుంచి దేవ‌ర అభిమానుల‌కు రిలీజ్ వ‌ర‌కూ జాత‌ర‌గానే ఉంటుంది. ఒక్కో అప్ డేట్ తో అభిమానుల్లో జోష్ నింప‌డానికి నిరంతరం టీమ్ ప‌నిచేస్తూనే ఉంటుంది. ఇప్ప‌టికే సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ‌స్ట్ మాస్ లుక్ తోనే సినిమా జ‌నాల్లోకి బ‌లంగా వెళ్లిపోయింది.

జాత‌ర ఆనాడే మొద‌లైంది....ఇక రిలీజ్ వ‌ర‌కూ అదే జాత‌ర కొన‌సాగుతుంది. ఇప్పుడా హీట్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. టీజ‌ర్, ట్రైల‌ర్ అంటూ చాలా హంగామానూ మును ముందు ఉంటుంది కాబ‌ట్టి అందుకు అభిమానులు సిద్దంగా ఉండ‌ట‌మే. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట సెన్సేషనల్ హిట్ అయింది. దీంతో సెకెండ్ సింగిల్ ఎప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇప్ప‌టికే సాంగ్ పై అప్డేట్ ఈ వారంలోనే ఉంటుందని ప్ర‌చారంలో ఉంది. ఈనేప‌థ్యంలో ఆడియో లేబుల్ సంస్థ టి సిరీస్ తాజాగా హింట్ ఇచ్చేసింది. సెకెండ్ సింగిల్గా దేవర నుంచి ఒక లవ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కానీ రిలీజ్ ఎప్పుడు? అన్న‌ది ఇంకా రివీల్ చేయ‌లేదు. అంత వ‌ర‌కూ స‌స్సెన్స్ అంటూ ఓ ర‌క‌మైన కిక్ ని అందిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే అత‌డి మ్యూజిక్ మార్కెట్ లో ఓ బ్రాండ్ లా మారిపోయింది. ఈ మ‌ధ్య కాలంలో సంగీతం అందించిన సినిమాల‌న్నీమ్యూజిక‌ల్ గామంచి విజ‌యం సాధిస్తున్నాయి. విక్ర‌మ్..జైల‌ర్ లాంటి సినిమాలు అత‌డికి పాన్ ఇండియావైడ్ మంచి పేరు తీసుకొచ్చాయి. ఇదే వేవ్ లో దేవ‌ర‌కి ప‌నిచేయ‌డం సినిమాకి క‌లిసొస్తుంది. మరి దేవ‌ర మిగ‌తా పాట‌లు ఎలా ఉంటాయో చూడాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్- యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లో సినిమా రిలీజ్ కానుంది.