Begin typing your search above and press return to search.

ఇదెక్క‌డి విచిత్రం.. ఓటీటీలో తుంబాడ్ రీరిలీజ్..

గ‌తేడాది రిలీజైన ఈ సినిమా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రూ.31 కోట్లు క‌లెక్ట్ చేసి రీరిలీజుల్లోనే ఎక్కువ వ‌సూళ్లు రాబ‌ట్టింది. గ‌తంలో తుంబాడ్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యేది.

By:  Tupaki Desk   |   23 Feb 2025 11:26 AM GMT
ఇదెక్క‌డి విచిత్రం.. ఓటీటీలో తుంబాడ్ రీరిలీజ్..
X

ఈ రోజుల్లో ఏ సినిమా అయినా థియేట‌ర్ల‌లో రిలీజైన వెంట‌నే పైర‌సీల్లోకి హెచ్‌డి క్వాలిటీతో వ‌చ్చేస్తుంది. దీంతో ఓటీటీ రిలీజ్ వ‌ర‌కు ఎవ‌రూ ఆగ‌డం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో ఓ సినిమా మాత్రం చాలా రేర్ ఫీట్ ను సాధిస్తుంది. 2018లో థియేట‌ర్ల‌లో రిలీజైన తుంబాడ్ మూవీకి అప్ప‌ట్లో అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.

గ‌తేడాది రిలీజైన ఈ సినిమా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రూ.31 కోట్లు క‌లెక్ట్ చేసి రీరిలీజుల్లోనే ఎక్కువ వ‌సూళ్లు రాబ‌ట్టింది. గ‌తంలో తుంబాడ్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఎప్పుడైతే రీరిలీజ్ అన్నారో ఆ టైమ్ లో మాత్రం ఏ ఓటీటీలోనూ తుంబాడ్ క‌నిపించ‌లేదు. ఇప్పుడు మ‌రోసారి తుంబాడ్ ఓటీటీలోకి వ‌చ్చింది.

గతంలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అందులో కనిపించడం లేదు. తాజాగా తుంబాడ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ముంజ్యా, స్త్రీ 2 లాంటి హారర్ కామెడీ మూవీస్ థియేటర్లలో హిట్ కావడంతో.. అదే సమయంలో మ‌ళ్లీ విడుదలైన తుంబాడ్ మూవీ సైతం మంచి రెస్పాన్స్ అందుకుంది.

మ‌రాఠా జానప‌ద క‌థ‌ల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలోని టెక్నిక‌ల్ క్వాలిటీస్, విజువ‌ల్స్, మ్యూజిక్ అన్నీ సినిమాను మ‌ళ్లీ మళ్లీ చూసేలా చేశాయి. తుంబాడ్ లోని విచిత్ర సినిమాటోగ్ర‌ఫీ, సౌండ్ స్కేప్, సినిమాను తెర‌కెక్కించిన ప‌రిస‌రాల‌న్నీ నేచుర‌ల్ గా ఉండ‌టం వ‌ల్ల ఈ సినిమాకు రిపీట్ ఆడియ‌న్స్ ఉన్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీలో ఒక‌ సినిమా రీరిలీజ్ అవ‌డం బ‌హుశా ఇదే మొద‌టి సారి అయుండొచ్చు.వందేళ్ల‌లో అస‌లు ఎవ‌రూ వెళ్ల‌ని చోటుకి ఎళ్లి మ‌రీ ఈ సినిమాను షూటింగ్ జ‌ర‌ప‌డం తోనే అంద‌రినీ ఎట్రాక్ట్ చేసిన తుంబాడ్ టీమ్, ఇప్పుడు దానికి సీక్వెల్ ను ప్లాన్ చేస్తుంది. రాహి అనిల్ బార్వే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇప్ప‌టికే ఎన్నో రేట్ ఫీట్స్ ను సాధించింది. ఇలాంటి ఫీట్స్ ను మ‌ళ్లీ భ‌విష్య‌త్తులో మ‌రేదైనా సినిమా సాధించ‌గ‌ల‌ద‌ని కూడా చెప్ప‌లేం. ప్ర‌స్తుతం తుంబాడ్ సీక్వెల్ కోసం ఆడియ‌న్స్ ఎదురుచూస్తున్నారు.