ట్యూన్స్ కాపీ క్యాట్ లు దొరికారిలా!
ఇదంతా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పరిపాటిగా జరిగే కార్యక్రమంలో మారిపోయింది.
By: Tupaki Desk | 2 Oct 2024 9:30 PM GMTసోషల్ మీడియా వెలుగులోకి వచ్చిన తర్వాత కాపీ క్యాట్ లు ఈజీగా దొరికిపోతున్న సంగతి తెలిసిందే. సినిమా కథని లిప్ట్ చేసినా? ట్యూన్ లిప్ట్ చేసినా? సీన్ లిప్ట్ చేసినా? రిలీజ్ అయిన వెంటనే దొరక్క పోయినా? కొన్ని రోజులకు ఏదో రూపంలో అది బయట పడుతుంది. అటుపై నెటి జనులు ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇదంతా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పరిపాటిగా జరిగే కార్యక్రమంలో మారిపోయింది.
ఒకప్పుడు సోషల్ మీడియా అందుబటులో లేదు కాబట్టి.. వాళ్లనే గొప్ప క్రియేటర్లగా భావించేవారు. ఇక ఒకప్పటి తెలుగు పాటల సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ కాలం నుంచి చిరంజీవి, బాలయ్య జనరేషన్ వరకూ సినిమా పాటలంటే ఎంతో అద్భుతంగా ఉండేవి. చెవులకు వినసొంపుగా ఉండేవి. ఇప్పటికీ ఆ పాటలకు అంతటి డిమాండ్ ఉంది. మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో వెతికి మరీ ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్ వింటుంటారు మ్యూజిక్ లవర్స్.
తాజాగా చాలా తెలుగు పాటలు హాలీవుడ్ నుంచో..బాలీవుడ్ నుంచో లిప్ట్ చేసిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నువ్వే నువ్వే సినిమాలోని `ఐయామ్ వెరీ సారీ` అనే ఓ పాట ఉంటుంది. ఈ పాటను ఓ హాలీవుడ్ సాంగ్ నుంచి ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నారు. 2001లో షకీరా సాంగ్ అయిన `వెన్ ఎవర్, వేర్ ఎవర్` అనే పాట వింటుంటే ఐయామ్ వెరీ సారీ సాంగ్‌కి ఎగ్జాక్ట్‌గా అనిపిస్తుంది.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ `ఆది` సినిమాలో `చిక్ చిక్ భం భం`, వెంకటేష్ `ప్రేమించుకుందాం రా` సినిమాలోని `ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా`, మహేష్ బిజినెస్‌మ్యాన్‌లోని `పిల్లా చావ్`, నాగార్జున క్రిమినల్ సినిమాలోని `తెలుసా మనసా` ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా లిస్టే ఉంది. వీటి ట్యూన్స్ విదేశీ పాటల నుంచి స్పూర్తిగా తీసుకున్నారా? కాపీ కొట్టారా? అన్నది తెలియదు గానీ అక్కడ నుంచి డంప్ అయినవే. అయితే ఆ హాలీవుడ్ సాంగ్స్ గురించి ఎవరికీ తెలియదు కాబట్టి పర్వాలేదు. ఏకంగా వరల్డ్ ఫేమస్ మైఖెల్ జాక్సన్ ట్యూన్లు కూడా లిప్ట్ చేసేస్తున్నారు. `లీవ్ మీ ఎలోన్ ట్యూన్‌ను` తీసుకొని `అందాల రాక్షసి`లో `పడితినమ్మో` అనే పాటకి వినియోగించారు. ఇంకా తవ్వితే జాబితా చాలా పెద్దదే ఉంటుంది.