Begin typing your search above and press return to search.

తుపాకి రివ్యూ అంటే ఒక బ్రాండ్

గత వీకెండ్లో ముందుగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’కు తుపాకి.కామ్ 2.25 రేటింగ్‌తో బిలో యావరేజ్ రివ్యూ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 1:30 AM GMT
తుపాకి రివ్యూ అంటే ఒక బ్రాండ్
X

సినిమాను సమీక్షించడం అన్నది అంత తేలికైన విషయం కాదు. కోట్లు ఖర్చు.. వందల మంది కష్టంతో తయారైన సినిమాను ఒక్క షో చూసి విశ్లేషించడం అంటే కత్తి మీద సాములాంటి పనే. ఐతే ఇంతకుముందులా సినిమా చూసిన రెండు మూడు రోజులకు పరి పరి విధాల ఆలోచించి.. విశ్లేషించి పత్రికలో పబ్లిష్ చేసే పరిస్థితి లేదు. వందల కొద్దీ వెబ్ సైట్లకు తోడు సోషల్ మీడియాలో పోటీ తీవ్రమైన పరిస్థితుల్లో షో పడ్డ వెంటనే రివ్యూలు వచ్చేస్తున్న నేపథ్యంలో ఆ పోటీలో సాగుతూనే సినిమాను నిర్మాణాత్మకంగా విశ్లేషించి.. సరైన రేటింగ్ ఇవ్వడం అన్నది అంత తేలికైన విషయం కాదు.

అన్నిసార్లూ సమీక్షకుడి దృష్టికోణం.. ప్రేక్షకుల అభిప్రాయానికి దగ్గరగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు రివ్యూలతో సంబంధం లేకుండా సినిమా బాగా ఆడొచ్చు, లేదా చతికిలపడొచ్చు. కానీ వీలైనంత నిష్పాక్షికంగా.. నిలకడగా సరైన రివ్యూలు, రేటింగ్స్ ఇస్తేనే సమీక్షలకు ఒక క్రెడిబిలిటీ అనేది వస్తుంది. ఈ విషయంలో ‘తుపాకి.కామ్’ ఎప్పుడూ తన ప్రత్యేతకను చాటుకుంటూనే ఉంది. ఇందుకు తాజా ఉదాహరణ.. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో సినిమాలకు ఇచ్చిన సమీక్షలు, రేటింగ్స్.


గత వీకెండ్లో ముందుగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’కు తుపాకి.కామ్ 2.25 రేటింగ్‌తో బిలో యావరేజ్ రివ్యూ ఇచ్చింది. అందుకు తగ్గట్లే ‘మిస్టర్ బచ్చన్’ రిజల్ట్ వచ్చింది. గత వారం సినిమాల్లో కలెక్షన్ల పరంగా అన్నింటికంటే దిగువన నిలిచిన చిత్రం.. మిస్టర్ బచ్చన్‌యే. ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి తుపాకి.కామ్ 2.5 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రం కూడా బిలో యావరేజే కానీ.. ‘మిస్టర్ బచ్చన్’తో పోలిస్తే కొంచెం బెటర్. బాక్సాఫీస్ దగ్గర కూడా ‘మిస్టర్ బచ్చన్’ మీద ‘డబుల్ ఇస్మార్ట్’ కొంత పైచేయి సాధించింది. కానీ ప్రేక్షకులను ఈ చిత్రం కూడా సంతృప్తి పరచలేదు.

ఇక తమిళ అనువాద చిత్రం ‘తంగలాన్’ సినిమాను తెలుగు రివ్యూయర్లు చాలామంది తప్పుగా అంచనా వేశారు. ఇది వేస్ట్ సినిమా అన్నట్లుగా రివ్యూలు ఇచ్చారు. 1.75 - 2 రేటింగ్స్ పడ్డాయి. కానీ అదొక వైవిధ్యమైన సినిమా. మంచి ప్రయత్నం. కొన్ని లోపాలున్నప్పటికీ చూడలేని చిత్రం కాదు. విక్రమ్, పా.రంజిత్‌ల కష్టాన్ని తక్కువ చేయలేం. ‘తుపాకి.కామ్’ ఈ చిత్రానికి 2.75 రేటింగ్‌తో పాజిటివ్ రివ్యూనే ఇచ్చింది.

ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌తో పోలిస్తే ఈ సినిమా మెరుగైన వసూళ్లు రాబడుతోంది. తమిళంలో ఇంకా బాగా ఆడుతున్న ఈ చిత్రం హిట్ అనడంలో సందేహం లేదు. ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్లో చివరగా వచ్చిన ‘ఆయ్’ చిత్రానికి ఫుల్ పాజిటివ్ రివ్యూతో 3 రేటింగ్ ఇచ్చింది తుపాకి.కామ్. చాలా సైట్లు 2.75కు పరిమితం అయ్యాయి. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలను మించి ఆడేస్తోంది. సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఈ సినిమానే అవుతోంది. ఈ సినిమా రివ్యూ, రేటింగ్ విషయంలోనూ తుపాకి.కామ్ పర్ఫెక్ట్ అని రుజువైంది.