ఎన్నిసార్లు దేశాన్ని కాపాడతావ్? స్టార్ హీరో వైఫ్ ఎగతాళి!
దేశభక్తి సినిమాలో నన్ను చూసిన ప్రతిసారీ, ఎన్నిసార్లు దేశాన్ని కాపాడతావు? అని తనను ఆటపట్టించేదని ఖిలాడీ చెప్పారు.
By: Tupaki Desk | 7 March 2025 5:37 PMదేశభక్తి సినిమాల్లో నటించడంలో అక్షయ్ కుమార్ కి ప్రత్యేకమైన రికార్డ్ ఉంది. బేబీ, గోల్డ్, మిషన్ మంగళ్, స్కై ఫోర్స్, ఎయిర్‌లిఫ్ట్, కేసరి ఇవన్నీ తెరపై జాతీయ హీరోలను తెరపై ఆవిష్కరించాయి. రిపబ్లిక్ వరల్డ్ ఈవెంట్ సందర్భంగా సినీనిర్మాణ రంగంలో అక్షయ్ కుమార్ తన ప్రయాణం గురించి చర్చించాడు. తన నిర్మాణ సంస్థ `కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్` తనను పలు దేశభక్తి ప్రాజెక్టులలో పనిచేయడానికి దారి చూపిందని పేర్కొన్నాడు. తన భార్య ట్వింకిల్ ఖన్నా తనను ఎగతాళి చేస్తుందని(సరదాగా) అక్షయ్ అన్నాడు. దేశభక్తి సినిమాలో నన్ను చూసిన ప్రతిసారీ, ఎన్నిసార్లు దేశాన్ని కాపాడతావు? అని తనను ఆటపట్టించేదని ఖిలాడీ చెప్పారు.
సినిమాల్లో హీరోయిజం చిత్రీకరణపై తన దృక్పథాన్ని కూడా అక్షయ్ షేర్ చేసారు. హాలీవుడ్ సినిమాల్లో అమెరికాను ఎలా హీరోను చేసారో అక్కీ వివరించే ప్రయత్నం చేసారు. హాలీవుడ్ కథలు ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు కాపాడేందుకు అమెరికాను అంతిమ రక్షకుడిగా ఎలా చిత్రీకరిస్తాయో అక్షయ్ ఎత్తి చూపారు. అది ఉగ్రవాద దాడి అయినా, గ్రహాంతరవాసుల దాడి అయినా లేదా గ్రహశకలం విపత్తు అయినా అమెరికన్ లనే హీరోలుగా చూసామని అక్షయ్ అన్నారు. భారతదేశాన్ని అదే విధంగా తెరపై ఎందుకు ప్రదర్శించలేదు అని ప్రశ్నించారు. భారతదేశ శక్తి సామర్థ్యాలను గుర్తు చేస్తూ, దీనికి యువతరం బాధ్యత తీసుకోవాలని సూచించారు.
తన దేశభక్తి సినిమాలు థియేటర్లలో అంతగా ఆడకపోయినా, తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో గొప్ప ప్రజాదరణ దక్కించుకున్నాయని కూడా అక్కీ అన్నాడు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి వెల్‌కమ్ టు ది జంగిల్, హేరా ఫేరి 3, భూత్ బంగ్లా వంటి కామెడీ ఎంటర్ టైనర్లలో అతడు నటిస్తున్నాడు.