ట్విట్టర్ ట్రెండ్ : టాప్ - 10 లో మనోళ్లు ఇద్దరు
తెలుగు హీరోలు ఇద్దరు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం తో టాలీవుడ్ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 July 2023 5:25 AM GMTఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ.. రాజకీయ.. క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల గురించి సందర్భం ఉన్నా లేకున్నా మాట్లాడుకోవడం చాలా కామన్ విషయం. ఆ స్టార్ గురించి లేదా ఆ ప్రముఖ వ్యక్తి గురించి జరిగే చర్చలో అత్యధికులు పాల్గొంటే ఆ పేరు ట్విట్టర్ ట్రెండ్ లో టాప్ లో నిలవడం మనం చూస్తూ ఉంటాం.
2023 సంవత్సరం సగం నెలలు పూర్తి అయింది. ఈ అర్థ సంవత్సరంలో ట్విట్టర్ ట్రెండ్ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ ఆరు నెలల కాలంలో ట్విట్టర్ లో ఏ వ్యక్తులకు సంబంధించిన అకౌంట్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది అనే విషయం గురించి జాబితా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇండియాకు చెందిన వ్యక్తుల అకౌంట్ లో అత్యధికంగా మాట్లాడుకున్నది భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి. టాప్ 10 జాబితాలో ఆయన నెం.1 స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్.. మూడవ స్థానంలో కోహ్లీ ఉండగా.. నాల్గవ స్థానంలో షారుఖ్ ఖాన్.. అయిదవ స్థానంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉన్నారు.
ఆ తర్వాత వరుసగా రోహిత్.. విజయ్.. పవన్ కళ్యాణ్.. మహేంద్ర సింగ్ ధోని.. మహేష్ బాబు లు ఆరు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. తెలుగు హీరోలు ఇద్దరు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం తో టాలీవుడ్ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధోని కంటే ముందు స్థానంలో పవన్ నిలవడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ ఒక్కడే ఈ జాబితాలో ఉన్నాడు. ఇక టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ గురించి ట్విట్టర్ లో ఎక్కువగా చర్చ జరిగింది. ఇండియన్ సినిమాల్లో అత్యధికంగా చర్చ జరిగిన టాప్ 10 చిత్రాల జాబితా తీస్తే అందులో నెం.1 స్థానంలో ఆదిపురుష్ నిలిచింది. ఆ తర్వాత వరుసగా లియో.. పఠాన్.. సలార్.. జవాన్ సినిమాలు రెండు నుంచి ఐదు వరకు స్థానాల్లో ఉన్నాయి.
2023 జనవరి నుండి జూన్ నెల వరకు ఆరు నెలల్లో ట్విట్టర్ లో అత్యధికంగా వినియోగించిన హ్యాష్ ట్యాగ్ ల టాప్ 10 జాబితాలో కూడా మన ఘనత నిలిచింది. ఐపీఎల్ 2023 హ్యాష్ ట్యాగ్ కి నెం.1 స్థానం దక్కగా ధోనీ.. ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ లు రెండు మూడవ స్థానాల్లో నిలిచాయి. మొత్తానికి ట్విట్టర్ లో మన వాళ్ళు... మన సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటారు అనేందుకు ఇదే నిదర్శనం.