Begin typing your search above and press return to search.

AAA : ఐదుగురిలో ఇద్దరు హీరోయిన్స్‌ వీళ్లే!

హ్యాష్ ట్యాగ్‌ AAA సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. సినిమా గురించి కొన్ని పుకార్లు సైతం తెగ షికారు అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   4 April 2025 2:30 PM
AAA : ఐదుగురిలో ఇద్దరు హీరోయిన్స్‌ వీళ్లే!
X

అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ అన్ని విషయాల గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్‌ AAA సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. సినిమా గురించి కొన్ని పుకార్లు సైతం తెగ షికారు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం అట్లీ ఏకంగా ఐదుగురు హీరోయిన్స్‌ను ఎంపిక చేయాలని అనుకుంటున్నాడని, కథలో భాగంగా సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌ ఉంటారని టాక్‌. అసలు విషయం ఏంటి అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ హీరోయిన్స్ పేర్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి.

మొదట్లో అల్లు అర్జున్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ను ఒక హీరోయిన్‌గా అట్లీ దాదాపుగా బుక్‌ చేశాడని, ఆమె ప్రస్తుతం రామ్‌ చరణ్‌కి జోడీగా బుచ్చిబాబు సినిమా పెద్దిలో నటిస్తున్న కారణంగా ఈ అవకాశంను దక్కించుకుని ఉంటుందనే టాక్‌ వచ్చింది. అల్లు అర్జున్‌, జాన్వీ కపూర్‌ల ఫోటోలను మర్జ్‌ చేసి సోషల్‌ మీడియాలో కొందరు పోస్టర్స్‌ను కూడా షేర్‌ చేశారు, వాటిని బన్నీ ఫ్యాన్స్ తెగ షేర్‌ చేశారు. ఇప్పుడు ఇదే సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ప్రస్తుత గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కనిపించబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. AAA సినిమా కోసం ప్రియాంక చోప్రాను ఇటీవల స్వయంగా దర్శకుడు అట్లీ కాల్‌ చేసి అడిగాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ వెళ్లిన తర్వాత బాలీవుడ్‌ సినిమాలకు సైతం ఆమె ఓకే చెప్పడం లేదు. కానీ టాలీవుడ్‌ జక్కన్న, ఇండియాస్‌ టాప్‌ డైరెక్టర్‌ అయిన రాజమౌళి అడగడంతో మహేష్ బాబు సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ షూట్‌లో పాల్గొంది. త్వరలో మరో షెడ్యూల్‌లోనూ ఆమె జాయిన్‌ కాబోతుంది. రాజమౌళి సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది కనుక అట్లీ దర్శకత్వంలోనూ ఈమె బన్నీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పి ఉంటుంది అని కొందరు భావిస్తున్నారు. కానీ అది నిజం కాకపోవచ్చు. రాజమౌళి సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఆమె నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ఉంటుంది. అంతే కాకుండా మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారా అనే విషయంలో క్లారిటీ లేదు.

అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో రూపొందుతున్న సినిమాను చాలా స్పీడ్‌గా పూర్తి చేసే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారు. అంత స్పీడ్‌గా సినిమాను పూర్తి చేయాలంటే ప్రియాంక చోప్రా నుంచి ఆ స్థాయిలో బల్క్‌ డేట్లు తక్కువ సమయంలో లభించడం దాదాపు అసాధ్యం. ఆ విషయం అట్లీ అండ్‌ టీంకి సైతం బాగా తెలిసే ఉంటుంది. కనుక ఆమెతో పెట్టుకుని సినిమాను ఆలస్యం చేసుకోవాలని అనుకోక పోవచ్చు. అయితే గెస్ట్‌ అప్పియరెన్స్‌ లేదా పావు గంట లేదా అరగంట కనిపించే సన్నివేశాల కోసం సంప్రదించారా అనేది చెప్పలేం. అంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అంత చిన్న పాత్రలకు ఒప్పుకుంటుందా... అయిదుగురు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా నటించేందుకు ఒప్పుకుంటుందా అనేది అనుమానమే.

ప్రస్తుతానికి AAA సినిమాలో ఐదుగురు హీరోయిన్స్‌ నటించబోతున్నారని, వారిలో ఒకరు జాన్వీ కపూర్‌ కాగా మరొకరు ప్రియాంక చోప్రా అని బలంగా సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే సినిమా ప్రారంభం కావాల్సిందే. సినిమా ఎలాగూ బన్నీ బర్త్‌డే సందర్భంగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీరిద్దరు బన్నీ AAA సినిమాలో ఉన్నారా లేదా అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. హాలీవుడ్‌ రేంజ్‌లోనే ప్రియాంక చార్జ్‌ చేస్తుందని అంటున్నారు. ఆ విషయంలోనూ అట్లీ అండ్ టీం ఆలోచించే అవకాశాలు ఉన్నాయి అని కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది చూడాలి.