Begin typing your search above and press return to search.

రజిని.. అమితాబ్.. ఇద్దరు ఇద్దరే..!

టీ జే జ్ఞానవేల్ డైరెక్షన్ లో రజినీ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా వేట్టయన్.

By:  Tupaki Desk   |   28 Sep 2024 3:55 AM GMT
రజిని.. అమితాబ్.. ఇద్దరు ఇద్దరే..!
X

సూపర్ స్టార్ రజినీకాంత్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఇద్దరు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఎంతో గొప్ప సేవ చేశారు. ఒక సాధారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. ఇక హిందీ చిత్ర పరిశ్రమలో అమితాబ్ గురించి ఎంత చెప్పినా సరిపోదు. ఓడి గెలచిన చరిత్ర ఆయనది. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక సినిమాలో భాగం అవుతున్నారు. టీ జే జ్ఞానవేల్ డైరెక్షన్ లో రజినీ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా వేట్టయన్. జై భీమ్ తర్వాత ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తో జ్ఞానవేల్ వస్తున్నారు.

రజినీ వేట్టయన్ లో బిగ్ బీ అమితాబ్ కూడా నటించారు. అక్టోబర్ 10న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో రజినీకి జతగా మలయాళ భామ మంజు వారియర్ నటించింది. నటిగా మంజు వారియర్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఐతే రజినీతో ఛాన్స్ అనగానే ముందుగానే ఎగ్జైట్ అయిన మంజు అనూహ్యంగా ఒక హుక్ స్టెప్ తో సెన్సేషనల్ గా మారింది.

వేట్టయన్ సినిమాలో యా యా యా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ లో మను వారియర్ గ్రేస్ ఫుల్ స్టెప్పులకు నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ సాంగ్ గురించి మంజు చాలా సంతోష పడుతుంది. అంతేకాదు ఒకేసారి రజిని, అమితాబ్ లాంటి ఇద్దరు లెజెండ్స్ తో కలిసి పనిచేయడం పట్ల ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇద్దరు డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీలు అంటూ చెప్పిన మంజు అందులో వారు పోటీ పడతారని చెప్పుకొచ్చారు.

రజినీ, అమితాబ్ లతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతి అని అన్నారు మంజు. ఈ సినిమాలో రజినీ సర్ వైఫ్ గా నటించానని సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. వేట్టయన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కోలీవుడ్ లో భారీ ప్రమోషన్ జరుగుతుంది. తెలుగులో కూడా వేట్టయన్ ను గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. జైలర్ తర్వాత సూపర్ స్టార్ నుంచి వస్తున్న సినిమాగా వేట్టయన్ పై భారీ హైప్ ఏర్పడింది.