Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోలంతా 2025 లో డ‌బుల్ బొనాంజా!

తెలుగు సినిమా పాన్ ఇండియాకి రీచ్ అవ్వ‌డంతో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా దిశ‌గా అడుగులు వేడ‌యంతో ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌లేక‌పోతున్నారు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 4:30 PM GMT
ఆ స్టార్  హీరోలంతా 2025 లో  డ‌బుల్ బొనాంజా!
X

స్టార్ హీరోలంతా ఒక‌ప్పుడు క‌నీసం ఏడాదికి ఒక సినిమా అయినా త‌ప్ప‌క రిలీజ్ చేసేవారు. రెండు సినిమాలు టార్గెట్ గా పెట్టుకుంటే ఒక చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మైంది. తెలుగు సినిమా పాన్ ఇండియాకి రీచ్ అవ్వ‌డంతో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా దిశ‌గా అడుగులు వేడ‌యంతో ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌లేక‌పోతున్నారు.

ప్ర‌భాస్ గ్యాప్ తీసుకున్నా ఒకే ఏడాది రెండు...మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఒక ఏడాది సినిమా రిలీజ్ అవ్వ‌లేదు అంటే ఆ ఏడాదంతా డార్లింగ్ ఆ రిలీజ్ ల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న‌ట్లు లెక్క‌. ఈ ఏడాది క‌ల్కి 2898తో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇక న‌టిసింహ బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరజీవి, కింగ్ నాగార్జున‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల నుంచి అయితే ఈ ఏడాది ఎలాంటి సినిమాలు రిలీజ్ కాలేదు.

కానీ కొత్త ఏడాది 2025 లో మాత్రం వీళ్లంతా డ‌బుల్ బొనాంజా అందించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` మార్చిలో రిలీజ్ అవుతుంది. అటుపై `ఓజీ` చిత్రాన్ని రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. ఇక చిరంజీవి న‌టిస్తోన్న `విశ్వంభ‌ర` ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రో కొత్త ప్రాజెక్ట్ ను వ‌చ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ చేసి ముగింపులో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌.

ఇక కింగ్ నాగార్జున `కుబేర‌`, `కూలీ` చిత్రాల్లో న‌టిస్తున్నారు. వాటిలో నాగార్జున కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ రెండు కూడా వ‌చ్చే ఏడాది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతాయి. అలాగే బాల‌కృష్ణ న‌టిస్తోన్న `డాకు మ‌హారాజు` సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతుంది. అటుపై బోయ‌పాటి శ్రీను తో చేస్తున్న `అఖండ -2`ను ద‌స‌రా కానుక‌గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక రామ్ చ‌ర‌ణ్ కూడా సంక్రాంతికి `గేమ్ చేంజ‌ర్` తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. అలాగే బుచ్చిబాబు తో చేస్తోన్న 16వ చిత్రం కూడా వ‌చ్చే ఏడాది లోనే రిలీజ్ అవుతుంది. విక్ట‌రీ వెంక‌టేష్ కూడా సంక్రాంతికి వ‌స్తున్నారు. అదే ఏడాది చివ‌ర్లో గానీ...ద‌స‌రాలోపు గానీ మ‌రో సినిమా చేసి రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తుంది.