టైసన్ సెకెండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అయ్యేనా?
తాజాగా మళ్లీ ప్రెష్ ప్రయత్నాలతో కనిపిస్తున్నాడు రాహుల్ టైసన్.
By: Tupaki Desk | 3 Jun 2024 3:30 AM GMTబ్యాక్ గ్రౌండ్ లేనోడు సక్సెస్ అయితే బ్లాస్ట్ ఎలా ఉంటుందో? నేటి జనరేషన్ లో నాని..విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు నిరూపించారు. నవతరానికి వాళ్లిద్దరు స్పూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తికేయ..సుహాస్ లాంటి వాళ్లు కూడా అలా వచ్చి సక్సెస్ అవుతున్నవాళ్లే. ఇప్పుడున్నది మునుపటి ఇండస్ట్రీ కాదు...నేటి జనరేషన్ ఇండస్ట్రీ అని కొత్త వాళ్లు సక్సెస్ అయినప్పుడల్లా అనిపిస్తుంటుంది. తాజాగా మళ్లీ ప్రెష్ ప్రయత్నాలతో కనిపిస్తున్నాడు రాహుల్ టైసన్.
ఇతడి గురించి పరిచయం అవసరం లేదు. శేఖర్ కమ్ముల `హ్యాపీ డేస్` తో పరిచయమైన నటుల్లో వరుణ్ సందేశ్.. నిఖిల్ తో పాటు రాహుల్ కూడా ఉన్నాడు. వారిద్దరిలా రాహుల్ కూడా బిజీ అవుతాడనుకుంటే? అతడి కెరీర్ మరో లా టర్న్ తీసుకుంది. రెండు..మూడు సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ రాకపోవడంతో మళ్లీ ఇండస్ట్రీలో కనిపించ లేదు. దీంతో రాహుల్ ని అంతా మర్చిపోయారు. కానీ నేను మాత్రం ఇక్కడే ఉన్నానంటూ ఇటీవలే రిలీజైన `భజే వాయు వేగం`లో కార్తికేయకు అన్నయ్యగా నటించి కనిపించాడు.
టైసన్ ని తెరపై అలా చూసి అంతా ఆశ్చర్యపోయారు. అందరూ ఒక్కసారిగా టైసన్ ని గుర్తు చేసుకున్నారు. సినిమాలో అతడి పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఈ సినిమా రాహుల్ కి మంచి కంబ్యాక్ లా చెప్పొచ్చు. కానీ ఈ ఐడెంటిటీని ఎలా వియోగించుకుంటాడు? అన్నది అతడి చేతుల్లోనే ఉంది. సెకెండ్ ఛాన్స్ దొరకడం అంత ఈజీ కాదు. కానీ రాహుల్ కి ఆ ఛాన్స్ మళ్లీ దక్కింది. తెలివిగా వినియోగించుకోగలిగితే మంచి అవకాశాలు వస్తాయి.
పైగా కొత్త వాళ్లకు సక్సెస్ రేటు కూడా బాగుంది. ట్యాలెంట్ ఉన్న వారంతా సక్సెస్ అవుతున్నారు. ట్యాలెంట్ పరంగా రాహుల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టైమ్ కలిసొస్తే దూసుకుపోతాడు. ఇప్పటికే యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లోనే ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే అదే బ్యానర్ లో వార్ బ్యాక్ డ్రాప్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా మరో సినిమా చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. పెద్ద బ్యానర్లే కాబట్లి రాహుల్ కివి మంచి అవకాశాలనే చెప్పాలి.