ఉదయభాను కూతుళ్లకి నారా బ్రాహ్మణి సర్‌ప్రైజ్ గిఫ్ట్
తన కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉంటూ తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది ఉదయభాను. తాజాగా తన యూట్యూబ్ లో ఉదయభాను ఓ స్పెషల్ విషయాన్ని షేర్ చేసుకుంది.
By: Tupaki Desk | 11 Feb 2025 6:08 AM GMTబుల్లి తెర తెలుగు ప్రేక్షకులకు యాంకర్ ఉదయ భాను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో టీవీ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగింది ఉదయ భాను. రేలా రె రేలా, వన్స్ మోర్ ప్లీజ్, ఢీ, సాహసం చేయరా డింభకా లాంటి ఎన్నో టెలివిజన్ ప్రోగ్రామ్స్ తో ఉదయభాను బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కేవలం యాంకర్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా అమ్మడు నటించింది.
అయితే కొంత కాలంగా యాంకర్ గా అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ మళ్లీ ఈ మధ్యే కొన్ని టీవీ షోలు, ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఉదయభాను సందడి చేస్తోంది. తన కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉంటూ తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది ఉదయభాను. తాజాగా తన యూట్యూబ్ లో ఉదయభాను ఓ స్పెషల్ విషయాన్ని షేర్ చేసుకుంది.
ఉదయభానుకి నందమూరి బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పే పన్లేదు. చాలా సందర్భాల్లో తనకు బాలయ్య చేసిన సహాయం గురించి ఉదయభాను ఎంతో గొప్పగా చెప్పుకుంది. ముఖ్యంగా తన బిడ్డల బర్త్ డే రోజు ఒక్క మెసేజ్ చేస్తే బాలయ్య గెస్టు గా వచ్చారని ఇప్పటికీ ఉదయభాను చెప్తూ ఉంటుంది.
ఇప్పుడు బాలయ్య కూతురు బ్రాహ్మణి తన ఇద్దరు పిల్లలకు గిఫ్ట్ గా ఓ వయోలిన్ ను పంపినట్టు ఉదయభాను తెలిపింది. తన పిల్లలకు ఆ గిఫ్ట్ గురించి చెప్పే క్రమంలో ఓ స్పెషల్ పర్సన్ మీకు గిఫ్ట్ పంపారని చెప్పింది ఉదయభాను. దానికి ఆమె కూతుళ్లు ఎవరు పంపారు అని అడగ్గా, బాలయ్య మామ అంటే ఎవరికి ఇష్టం ఇక్కడ అనగానే వారిద్దరూ వెంటనే మాకిష్టం అని చేతులెత్తారు.
వెంటనే ఆ వయోలిన్ ను పిల్లలకు ఇస్తూ బాలయ్య మామ పంపారని చెప్పింది ఉదయభాను. వయోలిన్ చూడగానే ఆ ఇద్దరు పిల్లలు చాలా సర్‌ప్రైజ్ అయి, థాంక్యూ బాలయ్య మామ అంటూ చెప్పారు. వీడియో చివర్లో ఉదయభాను.. బాలయ్య, ఆయన కూతురు బ్రాహ్మణికి థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ షేర్ అవుతుంది.