Begin typing your search above and press return to search.

న‌టుడు కం నాయ‌కుడు 25 కోట్ల ప‌రిహారం చెల్లించాల్సిందే

ప్ర‌ముఖ సినీ నిర్మాత తనపై వేసిన సివిల్ వ్యాజ్యాన్ని తిరస్కరించాలని కోరుతూ త‌మిళ‌నాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన దరఖాస్తుపై తుది ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు రిజర్వ్ చేసింది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 6:59 AM GMT
న‌టుడు కం నాయ‌కుడు 25 కోట్ల ప‌రిహారం చెల్లించాల్సిందే
X

ప్ర‌ముఖ త‌మిళ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ ఇటీవ‌ల పూర్తిగా రాజకీయనాయ‌కుడిగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే అత‌డిని ఓ పాత‌ కోర్టు కేసు వెంటాడుతోంది. దీనిపై కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగుతోంది.

ప్ర‌ముఖ సినీ నిర్మాత తనపై వేసిన సివిల్ వ్యాజ్యాన్ని తిరస్కరించాలని కోరుతూ త‌మిళ‌నాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన దరఖాస్తుపై తుది ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు రిజర్వ్ చేసింది. ఉపముఖ్యమంత్రి దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ ఆర్‌ఎంటీ టీకా రామన్ విచారించారు. ఓఎస్‌టీ ఫిలింస్‌కు చెందిన రామశరవణన్ దావాపై వాదిస్తూ తాను ఉదయనిధితో 'ఏంజెల్' చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నానని, ఆ సినిమాను పూర్తి చేసేందుకు అంగీకరించానని తెలిపారు. 2018లో షూటింగ్ ప్రాసెస్ ప్రారంభ‌మైంది. ఇప్పుడు సినిమా 80 శాతం పూర్తయింది. డబ్బింగ్ లిప్ సింక్ వంటి చిన్న ప్యాచ్ ప‌నులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఉదయనిధి నా మెసేజ్‌ల‌కు ప్రతిస్పందించలేదని.. షూట్‌కు తేదీలు ఇవ్వలేదని, అందువల్ల త‌న‌ సినిమాను పూర్తి చేయలేకపోయాన‌ని, ఇది భారీ నష్టాన్ని కలిగించిందని వాది చెప్పారు.

ఉదయనిధికి అడ్వాన్స్ డబ్బుగా రూ.30 లక్షలు ఇచ్చారని, షూటింగ్ కోసం దాదాపు రూ.13 కోట్లు వెచ్చించాన‌ని అత‌డు తెలిపారు. ఇదిలా ఉంటే ఉదయనిధి తన కెరీర్‌లో చివరి చిత్రంగా 'మామన్నన్‌'ని ప్రకటించారు. ఈ ప్రకటన కారణంగా అతడు తన 'ఏంజెల్' చిత్రాన్ని మార్కెట్ చేయలేడు.. ప్రచారం చేయలేడు.. అది భారీ నష్టాన్ని కలిగించింది. దీంతో తాజా దావాలో 25 కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేసాడు.

ఉదయనిధి తరపున‌ సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఎలాంగో తన క్లయింట్ తన యాక్టింగ్ పార్ట్‌లను పూర్తి చేశాడని, అందుకే అతడు ఇతర చిత్రాలలో న‌టించ‌డాన్ని కొన‌సాగించాడని, ఇప్పుడు అతడు పూర్తిగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉండి రాజకీయాలకు మారాడని కోర్టుకు వెల్ల‌డించారు. అందువల్ల వాది ఫిర్యాదును తిరస్కరించాలని కోరాడు. వాద‌ప్ర‌తివాద‌న‌లు విన్న అనంతరం న్యాయమూర్తి అక్టోబర్ 28న ఉత్తర్వులను రిజర్వ్ చేశారు.